తెలంగాణ ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పై కేంద్ర ఆహార, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ మండిపడ్డారు. ఢిల్లీలో నిన్న జరిగిన రాష్ట్రాల ఆహార శాఖ మంత్రుల సమావేశం, దేశంలో పౌష్టికాహార భద్రతపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు తెలంగాణ ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహా ఢిల్లీ, పశ్చిమబెంగాల్, మంత్రులు గైర్హాజరు అయ్యారు. దీంతో.. ముఖ్యమైన సదస్సుకు సంబంధిత రాష్ట్రాల మంత్రులు హాజరు కాకపోవడంపై పీయుష్ గోయల్ అసంతృప్తి…
అగ్నిపథ్ పథకం విషయంలో కేంద్రం వైఖరి మారాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బిహార్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కదా.. అక్కడ హింస ఎలా జరిగిందని బండి సంజయ్ ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అక్కడ బీజేపీ కుట్ర చేసిందా అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ మూర్ఖపు, దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని గంగుల మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కోణంలో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చింతకుంటలో పల్లెప్రగతి…
టీఆర్ఎస్, బీజేపీ పార్టీ మధ్య మాటల యుద్ధం జరుతూనే ఉంది. ఇటీవల కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారనే విషయం చర్చకు రావడంతో బీజేపీ విమర్శలకు దిగింది. అసలు కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలనంటూ బీజేపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ప్రధాని కావాలని అందరికీ కోరిక ఉంటుందని, 2024లో కూడా నరేంద్ర మోదీనే ప్రధాన మంత్రి అని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర…
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్. కొనుగోళ్లు చేయకుండా కనీస మద్దతు ధర అంటే ఏం లాభం అని ప్రశ్నించారు. తెలంగాణ పచ్చగా ఉండటం చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని విమర్శించారు. కావాలనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. 2020 ఏప్రిల్ నుంచి ఐదు కిలోల ఉచినత బియ్యం అందిస్తున్నామని..90 లక్షల కార్డుల్లో 53 లక్షల మందికి మాత్రమే బియ్యాన్ని అందించిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందరికి…
తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఆనాడు ఏ ప్రభుత్వమూ ఆలోచించలేదని, రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గ్రామాలు ఆర్థికంగా ఎదిగేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మండువేసవిలో కూడా నీరు ఇచ్చిన ఘనత ఒక్క కేసీఆర్ ప్రభుత్వానిదేనని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకముందు కరీంనగర్‌లో తాగు, సాగునీటి కోసం అష్టకష్టాలు పడేవాళ్ళమని గుర్తు చేశారు. ఆనాడు కరెంట్ కావాలని తాను…
హైదరాబాద్ టూర్‌లో భాగంగా.. కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం బందీ అయ్యిందంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం ప్రజలతో ఎన్నుకోబడినదని, వాళ్ళెవరూ నామినేటెడ్ పదవులలో లేరని అన్నారు. గుజరాత్‌లో లేని అభివృద్ధి తెలంగాణలో ఉండడం చూసి.. ఆ ఈర్ష్యతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహించారు. దేవుణ్ణి చూపించి, మూఢ నమ్మకాల రాజకీయాన్ని బీజేపీ నడుపుతోందని విమర్శించారు. కానీ, తాము మాత్రం దేవుణ్ణి కొలుస్తూ రాజకీయం చేస్తున్నామని గంగుల కమలాకర్…
డబుల్ బెడ్రూం లబ్దిదారులకు శుభవార్త చెప్పారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా మొగ్దుంపూర్ లో డబుల్ బెడ్ రూం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… డబుల్ బెడ్రూం ఇండ్లు దశల వారీగా ఇస్తామని.. ఎవరికీ అన్యాయం జరుగనివ్వబోమని ప్రకటించారు. ఇది కంటీన్యూయస్ ప్రాసెస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు కూడా మనము ఇక్కడే బతికి ఉన్నామని చెప్పారు. ఒకప్పుడు రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయిగా…
రాష్ట్రంలో బీసీ అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు బీసీలు రుణపడి ఉంటారని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ.. బీసీలకు చేసింది ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 75ఏళ్లలో ఏ.. ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన…
Telangana CM K Chandra Shekar Rao Meeting With TRS Minister. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు సాగుతోంది. పంజాబ్ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నట్లుగానే తెలంగాణలోనూ పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ మంత్రులు నిన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి యాసంగి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీ నామానాగేశ్వర…