Gangula Kamalakar : రాష్ట్రంలో విభజన శక్తులు పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో విభజన శక్తులు పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. నాటి నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన ఉద్యమ చరిత్రను, అమరవీరుల త్యాగాలను తప్పుగా అర్థం చేసుకుంటూ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించేందుకు కొన్ని విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో యావత్ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండి ఆ కుట్రలను తిప్పికొట్టి విజ్ఞతతో శత్రుత్వాన్ని ఓడించాలి. ప్రజల విశ్వాసంతో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించడంతోపాటు జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో ప్రజల్లో ఐక్యతను కొనసాగించాలని పోలీసు పరేడ్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం మంత్రి ప్రసంగించారు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది.
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
75 ఏళ్ల స్వాతంత్య్రంలో 60 ఏళ్ల పాటు తెలంగాణ తన గుర్తింపు కోసం పాటుపడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అన్ని రంగాల్లో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసిన తెలంగాణ తక్కువ కాలంలోనే అగ్రగామి రాష్ట్రంగా అవతరించింది. నీటి కష్టాలు తీరేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంతో ఎండిపోయిన భూములు పచ్చని పొలాలుగా మారాయని తెలిపారు. రైతు బంధు, రైతు బీమాతో పాటు 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాను రైతు బంధు, రైతు సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. 2022 వానకాలం సీజన్‌కు సంబంధించి రైతుబంధు పథకం కింద 1,81,728 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.177.67 కోట్లు జమ చేశారు.
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!