2022-23 వానాకాలం ధాన్యం సేకరణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి గంగుల కమలాకర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణలో పంటలు బాగా పండాయన్నారు.. 24 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 1 కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని.. తెలంగాణ రైతు పండించిన ప్రతీ గింజా కొంటామని స్పష్టం చేశారు.. ఈ సీజన్‌లో 112 లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు అంచనా వేశామని.. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు.. సర్వే నెంబర్ల వారీగా పంటల వివరాల ట్యాగింగ్ చేస్తాం.. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరగాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..
Read Also: TSPSC Group 1 Exam: ఈనెల 16న గ్రూప్-1 పరీక్ష.. ఇవి మాత్రం మర్చిపోవద్దు..!
రైతులకు, మిల్లులకు సంబంధం ఉండకూడదు అని స్పష్టం చేసిన మంత్రి గంగుల.. ఎఫ్‌సీఐ నిర్దేశించిన పెయిర్ ఆవరేజి క్వాలిటీ ప్రకారం సేకరణ ఉంటుందన్నారు. రైతులు ఏఫ్ఏక్యూ ఖచ్చితంగా పాటించండి.. సరిహద్దుల్లో పటిష్ట చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేరే రాష్ట్రం నుండి ఒక్క గింజ కొనుగోలు కేంద్రాలకు రానివొద్దని స్పష్టం చేశారు.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అంతిమంగా రైతుల సంక్షేమమే ముఖ్యం అన్నారు.. ధాన్యం సేకరణపై వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ, పోలీస్, మార్కెటింగ్ శాఖలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి గంగుల.. కీలక ఆదేశాలు జారీ చేశారు.