బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు కరీంనగర్ ముస్తాబైంది.. శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరీంనగర్ బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. స్వామివారి ఆలయంతోపాటు ఆరో వార్షిక బ్రహ్మోత్సవాలను గతంలో కంటే వైభవంగా నిర్వహించేందుకు మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కరీంనగర్‌లో పర్యటించారు. ఇటీవల బీసీ సంక్షేమం, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మృతిచెందడంతో వారి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించారు.
Gangula Kamalakar: సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలకతీతంగా అందరూ పోరాటం చేసారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ సంపద పెరిగిందని అన్నారు. హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని అన్నారు. ఉమ్మడి రాజధాని విషయంలో 10 ఏండ్ల గడువుందని పేర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వై.ఎస్. బిడ్డ వెరైటీ ముసుగుతో ఇక్కడకొచ్చిందని ఎద్దేవ చేశారు.…
మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర నేడు ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్లో విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే సీబీఐ అధికారులు గంగుల కమలాకర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఢిల్లీకి రావాలని ఆదేశించారు.
మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసు ఇచ్చింది. ఢిల్లీలో అరెస్ట్ అయిన శ్రీనివాస్ వ్యవహారంలో నోటీసులో పేర్కొంది. మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో సీబీఐ శ్రీనివాసుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ ని సీబీఐ అరెస్ట్ చేసింది.