అగ్రరాజ్యం అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆంధప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
తెలిసీతెలియని వయసులో కొంత మంది యువతీయుకులు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు గానీ.. పెద్దలు గానీ తప్పు అని చెబితే మాత్రం పగ పెంచుకుంటున్నారు. చివరికి కన్నపేగు బంధాన్ని కూడా తెంచుకోవడానికి వెనుకాడటం లేదు.
స్నేహితులే కాలయములుగా మారి భార్యను అసభ్యకరంగా దూషించడనే నేపంతో స్నేహితుడిని హత్య చేశాడు . రైల్వే స్టేషన్ లో సమోసాలు అమ్ముకునే ఇద్దరు స్నేహితుల మధ్య మద్యం మత్తులో వివాదం ఏర్పడింది. ఈ వివాదంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. తన భార్యను అసభ్యకరంగా మాట్లాడటంతో ఈ హత్యకు దారితీసింది. రాఖీ పండుగ రోజున జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది..
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. నలుగురు యువకులు ఫ్రెండ్ బర్త్ డే కోసం ఎర్టీగా కారు రెంట్ కి తీసుకుని వెళ్లారని తెలిపారు. బర్త్ డే పార్టీలో మద్యం సేవించినట్లు వెల్లడించారు. Also Read:Kissing:…
జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. జిల్లా కేంద్రంలోని వినాయక బార్ వెనుకాల ఓ వ్యక్తిని స్నేహితులు బండ రాయితో కొట్టి నిప్పంటించారు. మృతుడు జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో జీవనం కొనసాగిస్తున్న వెంకన్నగా పోలీసులు గుర్తించారు.
సిరియాలో తిరుగుబాటు తర్వాత బషర్ అల్-అస్సాద్ దేశం విడిచి పారిపోయారు. బషర్ అల్-అస్సాద్, ఆయన కుటుంబానికి రష్యా ఆశ్రయం ఇచ్చింది. మానవతా దృక్పథంతో ఆయనకు ఆశ్రయం కల్పించినట్లు తెలిపింది. మాస్కోలో ఉన్నారని రష్యా రాయబారి మిఖాయిల్ ఉలియానోవ్ తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం.. ఎక్స్‌లో ఆయన ఓ పోస్ట్ చేశారు. "బ్రేకింగ్! అస్సాద్, అతని కుటుంబ సభ్యులు మాస్కోలో ఉన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో రష్యా తన స్నేహితులకు ద్రోహం చేయదు. ఇదే రష్యా- యూఎస్ మధ్య…
విహారయాత్రకు వచ్చిన ఓ మిత్ర బృందంలోని మిత్రుల మధ్య వేసుకున్న పందెంలో ఓ యువకుడు విగత జీవిగా అనుమానాస్పద రీతిలో ప్రాణం కోల్పోయిన ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం పాత కొత్త చెరువు గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు సురేంద్ర (26) అనే యువకుడు, మరో 9 మందితో స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లారు.. స్నే
ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (60) లేటు వయసులో మళ్లీ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రియురాలు లారెన్ శాంచెజ్ (54)ను త్వరలోనే ఆయన వివాహం చేసుకోనున్నారు. క్రిస్మస్ రోజున వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.
కొత్త ఫోన్ కొనుక్కోవడమే ఆ బాలుడికి శాపమైంది. కొత్త మొబైల్ కొన్న ఆనందం ఎంతో సేపు లేకుండానే ఆవిరైపోయింది. స్నేహితుల దుర్బుద్ధి కారణంగా ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ తల్లికి కడుపుకోత మిగిల్చారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని షకర్‌పూర్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.