AP Crime: స్నేహితుడి భార్యతో రాఖీ కట్టించుకోవడానికి నిరాకరించాడు..! హత్యకు గురయ్యాడు..
- స్నేహితులే మరో స్నేహితుడు పట్ల కాలయముడులుగా మారారు..
- స్నేహితుడి భార్యతో రాఖీ కట్టుకోవడానికి నిరాకరణ..
- స్నేహితుడి భార్యపై అసభ్యవ్యాఖ్యలు చేసిన యువకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: స్నేహితులే మరో స్నేహితుడు పట్ల కాలయముడులుగా మారారు. రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్ కు చెందిన భాగ్ రాధాకాంత్. రాఖీ పండుగ రోజున తన భార్యతో రాఖీలు కట్టించడానికి స్నేహితులను ఇంటికి పిలిచాడు. అందరూ రాఖీలు కట్టించుకున్నారు. కానీ, ధవళేశ్వరానికి చెందిన వేపాడి సతీష్ కుమార్ రాఖీ కట్టించుకోవడానికి నిరాకరించాడు. పైగా రాధాకాంత్ భార్యా శీలాన్ని దూషించాడు. దీనితో సతీష్ కుమార్ పై కక్ష పెంచుకున్నాడు రాధాకాంత్ . పథకం ప్రకారం మద్యం మత్తులో ఉండగా తన తోటి స్నేహితులతో కలిసి సతీష్ కుమార్ ను హత్య చేశాడు.. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను టూ టౌన్ సీఐ పి. శివగణేష్ అరెస్టు చేశారు.
Also Read
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన వేపాడి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితులైన ఆల్కట్ గార్డెన్స్ చెందిన భాగ్ రాధాకాంత్, భాగ్ గౌతం, దొంగ సౌధిరాజు, బాలాజీపేటకు చెందిన మోటూరి రవి, భీమవరానికి చెందిన నమ్మి సూర్యతేజ అతనిని హత్య చేసినట్లు తేల్చారు. రెండో పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. ధవళేశ్వరం ఐవోసీఎల్ ప్రాంతానికి చెందిన వేపాడి సతీష్ కుమార్(22) రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఈ నెల 8వ తేదీ రాత్రి తండ్రి మందలించడంతో ఇంటి నుంచి బయటకొచ్చి తిరిగి వెళ్లలేదు. కుటుంబ సభ్యులు ధవళేశ్వరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పుడప్పుడూ కైలాసభూమి వెనుక ప్రాంతంలో మద్యం తాగుతుండేవాడని సతీష్ కుమార్ తో పనిచేసేవారు చెప్పడంతో ఈ నెల 15న ఆయన సోదరుడు అక్కడికి వెళ్లి చూడగా.. మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు.
ఇక, రెండో పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సీఐ పి. శివ గణేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 9న తెల్లవారుజామున సతీష్ కుమార్ స్నేహితులైన భాగ్ రాధాకాంత్, బాగ్ గౌతం, దొంగ సౌదిరాజు, బాలాజీపేటకు చెందిన మోటూరి రవి, భీమవరానికి చెందిన నమ్మి సూర్యతేజతో కలిసి గోదావరి గట్టు దిగువన కైలాసభూమి శ్మశానంలోకి వెళ్లినట్లు గుర్తించారు. లోతుగా విచారించగా ఘటనకు ముందురోజు రాత్రి భాగ్ రాధాకాంత్ భార్య గురించి చెప్పమంటే నిరాకరించడంతోపాటు మళ్లీ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడట.. దీంతో, వాగ్వాదం జరిగి అతన్ని కాళ్లు, చేతులతో తన్ని కర్రతో కొట్టి, అపస్మారక స్థితిలో ఉన్న సతీష్ కుమార్ పీకపై భాగ్ రాధాకాంత్ కాలువేసి ప్రాణం పోయేవరకు తొక్కేసి, మృతదేహాన్ని కైలాసభూమి వెనక గోడ అవతల విసిరి ఇళ్లకు వెళ్లిపోయినట్లు తేలింది. తమ గురించి పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకున్న నిందితులు ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం ఆల్కట్ గార్డెన్స్ వీఆర్వో సమక్షంలో పోలీసులకు లొంగిపోవడంతో రిమాండ్ కు తరలించారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!