Jeff Bezos Marriage: అమెజాన్ వ్యవస్థాపకుడు రెండో పెళ్లి.. క్రిస్మస్ రోజున ప్రియురాలితో వివాహం
- అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రెండో పెళ్లి
- క్రిస్మస్ రోజున ప్రియురాలితో వివాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (60) లేటు వయసులో మళ్లీ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రియురాలు లారెన్ శాంచెజ్ (54)ను త్వరలోనే ఆయన వివాహం చేసుకోనున్నారు. క్రిస్మస్ రోజున వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. అతికొద్ది మంది స్నేహితుల మధ్య ఈ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Also Read
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
శీతాకాలంలో ఈ జంట పెళ్లితో ఒక్కటి కాబోతుంది. కొలరాడోలోని ఆస్పెన్‌లో కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో డిసెంబరు 25న వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. గతేడాది మే నెలలో వీరు నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఫ్రాన్స్‌లో వెకేషన్‌కు వెళ్లిన సందర్భంలో ఓ లగ్జరీ నౌకలో 2.5 మిలియన్ డాలర్ల గులాబీ రంగు వజ్రాల ఉంగరం ఇచ్చి బెజోస్.. ప్రియురాలికి ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. 54 ఏళ్ల లారెన్ శాంచెజ్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. లారెన్ శాంచెజ్.. తన భర్తకు విడాకులు ఇవ్వకముందు నుంచే ఈ వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
2018 నుంచే బెజోస్, లారెన్ డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలికారు. మెకంజీతో ఆయనకు నలుగురు సంతానం ఉన్నారు. ఈ విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు లారెన్ , బెజోస్.. తమ మధ్య బంధాన్ని బయటకు అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు, లారెన్‌కు గతంలో పాట్రిక్ వైట్‌సెల్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మాజీ ఎన్‌ఎఫ్‌ఎల్ ఆటగాడు టోనీ గోంజలెజ్‌తోనూ ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చారు. ఇదిలా ఉంటే లారెన్ తన మాజీ భర్తలను, పిల్లలను బెజోస్‌కు ముందుగానే పరిచయం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!