US: అమెరికాలో విషాదం.. ఏపీ విద్యార్థిని అనుమానాస్పద మృతి!
- అమెరికాలో విషాదం
- ఏపీ విద్యార్థిని అనుమానాస్పద మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్రరాజ్యం అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆంధప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వైద్య పరీక్షలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. నవంబర్ 7న యార్లగడ్డ చనిపోయినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Kochi: కొచ్చిలో అర్ధరాత్రి ప్రమాదం.. పగిలిన భారీ నీటి ట్యాంక్.. ఇళ్లు జలమయం
Also Read
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Digital Arrest Scam: బాపట్లలో రిటైర్డ్ టీచర్ డిజిటల్ అరెస్ట్.. రూ.60 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..
- CM Chandrababu: మొన్న మూడుముక్కలాట.. నిన్న మావిగన్.. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు..
- Land Dispute: బాపట్ల ఎస్పీ ఫ్యామిలీ భూకబ్జా.. కొనసాగుతున్న విచారణ
యార్లగడ్డ రాజ్యలక్ష్మి టెక్సాస్‌లోని ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీ-కార్పస్ క్రిస్టి నుంచి పట్టభద్రురాలు. అమెరికాలోనే ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఇంతలోనే మృత్యువు వెంటాడింది. అపార్ట్‌మెంట్‌లో అకస్మాత్తుగా చనిపోయింది. రెండు రోజులుగా తీవ్ర దగ్గుతో బాధపడుతుందని స్నేహితులు చెబుతున్నారు. అయితే కచ్చితమైన కారణం తెలియాలంటే రిపోర్ట్ వచ్చాకే తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. కుమార్తె మరణవార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mali: జిహాదీకి వ్యతిరేకంగా వీడియోలు.. మహిళా టిక్‌టోకర్‌ను చంపిన ఉగ్రవాదులు
నవంబర్ 7న, 2025న నిద్రలోనే ఆమె చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఉదయాన్నే లేపగా మేల్కోకపోవడంతో స్నేహితులు గుండెలు బాదుకుంటూ ఏడ్చేశారు. రెండు, మూడు రోజులగా తీవ్రమైన దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతుందని బంధువు చైతన్య తెలిపారు.
ఇక మృతదేహాన్ని ఆంధప్రదేశ్‌కు పంపించేందుకు చైతన్య.. టెక్సాస్‌లో నిధులు సేకరిస్తున్నారు. రాజ్యలక్ష్మిది ఆంధప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని కర్మెచెడు గ్రామం. తల్లిదండ్రులు అన్నదాతలు. ఎన్నో కలలతో అమెరికాకు పంపినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!