YS Jagan Fan: స్నేహితులతో పందెం కట్టి ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వీరాభిమాని.. అరగుండు గీయించుకున్న ఘటన ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్లకు చెందిన వీరవల్లి శివ రామకృష్ణ అలియాస్ శివ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వీరాభిమాని.. అయితే, స్నేహితులతో కట్టిన పందెంతో అరగుండు గీయించుకున్న వీడియో, ఫొటోలు సోషల్ మీడియాకు ఎక్కడంతో ఈ వ్యవహారం వైరల్‌గా మారిపోయింది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే తాను అరగుండు గీయించుకుంటానని స్నేహితులతో పందెం వేశాడట శివ.. ఇక, వైసీపీ ఓడిపోవడం.. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలో శివను ప్రశ్నించారట స్నేహితులు.. ఎన్నికలకు ముందు నువ్వు చేసిన ఛాలెంజ్ సంగతి ఏంటి అంటూ స్నేహితులు ప్రశ్నించడంతో, ఇచ్చిన మాట ప్రకారం అరగుండు గీయించుకున్నాడు శివ.. వైఎస్ జగన్ వీరాభిమానిగా ఉన్న శివ.. వైసీపీ ఓడిపోవడంతో.. స్నేహితులతో వేసిన పందెం కోసం అరగుండు గీయించుకున్న వీడియో, ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Read Also: Trump: ‘అమెరికా భవిష్యత్తు చైనా నాసిరకం ఉక్కుపై ఆధారపడి ఉండదు’.. ఉక్కు దిగుమతులపై 50% సుంకం
ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేసిన శివ.. నేను నమ్మిన దేవుడు వైఎస్ జగన్.. ఆయన కోసం ఇచ్చిన మాట కోసం అరగుండు గీయించుకున్నాను.. ఇచ్చిన మాట కోసం ఇలా చేయడం చాలా గొప్పగా ఉందన్నారు.. ఎన్నికల సమయంలో వైసీపీ గెలుస్తుందని.. ఛాలెంజ్ చేశా.. అందులో భాగంగా కొందరికి డబ్బులు ఇచ్చా.. ఇంకా కొందరితో అరగుండు ఛాలెంజ్ చేశా.. అయితే, వైసీపీ ఓడిపోయిన తర్వాత.. మూడు, నాలుగు నెలలు నేను కోలుకోలేకపోయా.. నా స్నేహితులు కూడా కొన్నిసార్లు అడిగి వదిలేశారు.. కానీ, నేను మాట ఇచ్చాను కాబట్టి.. చేయించుకోవాలని అనుకున్నా.. అరగుండు గీయించుకుని.. వీడియో తీసి.. నా స్నేహితులకు పెట్టా.. అరగుండుతో సెంటర్‌లో తిరిగా.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే.. ఆ కిక్కు ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు తెలిసిందని ఆ వీడియోలో పేర్కొన్నాడు వైఎస్ జగన్ వీరాభిమాని శివ..