Errabelli Dayakar Rao: సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులకు కమిషనర్ దారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వివాదం జరిగింది. మిర్చిని అమ్ముకోవటానికి వచ్చిన రైతులను కమిషన్ దారులు అడ్డుకున్నారు.
“కల్లా కపటం కానని వాడా లోకం పోకడ తెలియని వాడా ఏరువాక సాగాలో రన్నో చిన్నన్న నీ కష్టం అంటా తీరునురో రన్నో చిన్నన్న” 1955 ఏప్రిల్ 14న రిలీజ్ అయిన “రోజులు మారాయి” ఈ సినిమాలోని ఈ పాట అప్పట్లో మారుమ్రోగింది. ఈ పాటను గాన కోకిల జిక్కి పాడారు. ఆపాటలో బాలివుడ్ హీరోయిన్ వహిదారహమాన్ డాన్స్ ఆడుతూ ఈ సాంగ్ పూడుతుంటే.. అక్కినేని నాగేశ్వరావు సద్దిఅన్నం మూట గట్టుకుని, ఎద్దులను తీసుకుని పోయే సీన్…
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరల పెరుగుతున్నా దేశంలో ఆ భారాన్ని రైతులపై పడనీయబోమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు కొనుగోలు చేసే డీఏపీ, పాస్పటిక్, పొటాషియం ఎరువులపై ఏకంగా 60 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఏపీ బస్తాపై ప్రస్తుతం ఉన్న రూ.1,850 సబ్సిడీని రూ.2,501కి పెంచింది. ఇది గత ఏడాది కంటే 50…
రైతుల కోసం మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి సంబంధించి ఈనెల 25 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ‘కిసాన్ భగీదారీ ప్రాథమిక హమారీ’ పేరిట ప్రచారాన్ని నిర్వహించాలని తలపెట్టింది. వ్యవసాయానికి సంబంధించిన అన్ని సంస్థలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నాయి. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దేశంలో ఉన్న 720 కృషి విజ్ఞాన…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. సినిమాల్లో నటించడం, కోట్లు సంపాదించడం మినహా పవన్ కళ్యాణ్‌కు వ్యవసాయం అంటే తెలియదని ఎద్దేవా చేశారు. అన్నీ పాములు ఆడితే ఏలిక పాము కూడా లేచి ఆడిందన్న చందంగా పవన్ కళ్యాణ్ వ్యవసాయం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచే అర్హత కూడా పవన్…
కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కౌలు రైతులను ప్రభుత్వం రైతులుగా భావించడం లేదని ఆమె మండిపడ్డారు. కౌలు రైతు బతికి ఉన్నంత వరకు రైతు బీమా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు షర్మిల లేఖ రాశారు. రైతు బీమా విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై కేసులు పెట్టి న్యాయ పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. కౌలు రైతులను రైతులుగా ఎందుకు చూడరని ఆమె ప్రశ్నించారు. 80వేల పుస్తకాలు చదివి పడేసిన అపర…
తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో గత ఏడాదిలాగే ఈసారి కూడా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. వరికి ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో.. రైతులు యథావిధిగా వరిని సాగుచేస్తున్నారు. దీంతో మరోసారి తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. యాసంగి పంటల విషయంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుటారని భావించినప్పటికీ.. వరినే సాగుచేయడంతో ఈసారి గణనీయంగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఇప్పటికే వానాకాలం వరి విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళికను సైతం వ్యవసాయ…
పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్ వ్యవహారంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా టాక్ నడుస్తోంది. దీనిపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతన్నల కడుపు మండిందని.. అందుకే వారు ప్రధాని మోదీకి చుక్కలు చూపించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా త్వరలోనే రైతులు బుద్ధి చెప్తారని… ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. అధికారం ఇస్తే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని షర్మిల మండిపడ్డారు.…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున సహాయం మంజూరు చేసింది. మొత్తం 133 కుటుంబాలకు రూ.7.95 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణశాఖ జీవో జారీ చేసింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 27 మంది రైతులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 23 మంది రైతులు, భూపాలపల్లిలో 12 మంది రైతుల…