Errabelli Dayakar Rao: సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జనగామ జిల్లా కలెక్టరేట్‌లో అకాల వర్షాలు, పంట నష్టం, ధాన్యం కొనుగోలు వంటి పలు అంశాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కలెక్టర్, అదనపు కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలసత్వం వహించవద్దని అన్నారు. ఇటీవల కురిసిన వడగళ్ల వాన వల్ల పంట నష్టపోయిన రైతుల వివరాలను వెంటనే సేకరించాలని సూచించారు. నష్టపోయిన పంటల నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ఆదేశించారు.
Read also: Srinivas Goud: వైన్స్ షాప్ ల్లో రిజర్వేషన్లు .. పదేళ్లలో ఎక్కడికో వెళ్ళిపోతాం
చివరి గింజ వరకు రైతుల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, మొక్కజొన్నలను కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించిందన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయాలని, మొక్కజొన్న కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతేకాని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎగుమతి చేయాలన్నారు. అందుకోసం రైతులకు నష్టం వాటిల్లకుండా ట్రాన్స్ ఫోర్ట్ కొనుగోలు కేంద్రాల్లో పక్కాగా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ జెడ్పీ చైర్మన్ పాకాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సంబంధిత శాఖల అధికారులు, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.