Khammam market: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులకు కమిషనర్ దారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వివాదం జరిగింది. మిర్చిని అమ్ముకోవటానికి వచ్చిన రైతులను కమిషన్ దారులు అడ్డుకున్నారు. దీంతో మిర్చి అమ్మడంపై ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పొట్టన కొటకండి అంటూ రైతులు వాపోయారు. అయితే కమిషన్ దారులు సశేమిరా అన్నారు. మిర్చి అమ్మడం ఆపివేయాల కోరారు. దీంతో అడ్డుకున్న కమిషన్ దారులపై రైతు కుటుంబం దాడికి పాల్పడ్డారు. ఈనేపథ్యంలో.. రైతులపై కమిషన్ దారులు దాడికి పాల్పడ్డారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రణరంగంగా మారింది. రైతులు ఆగ్రహం కట్టెలు తెంచుకుంది మేము న్యాయంగా చేస్తుంటే కమిషన్ దారులు ఇలా అడ్డుకోవడం తగదంటూ వాగ్వాదానికి దిగారు. ఈనేపథ్యంలో రైతులకు గాయాలు కాగా.. ఈ ఘటనలో కమిషన్ దారులకు చొక్కాలు చిరిగింది. ఈఘటనపై స్థానిక సమచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు రైతులను అదుపులో తీసుకున్నారు.
ఏం జరిగిందంటే..
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన రైతులు కమిషన్ దారుకు అమ్ముకోవడం జరిగింది. అయితే అంతకుముందు కమిషన్ దగ్గర వడ్డే వెంకటేశ్వర్లు అనే కమిషన్ దారుల దగ్గర రైతులు అప్పు తెచ్చుకున్నారు అప్పు చెల్లించకుండా మరో కమిషన్ దారులకు రైతులు అమ్ముకోవడానికి ప్రయత్నం చేయటంతో వివాదం చోటుచేసుకుంది ఈ నేపథ్యంలో రైతుకి కమిషన్ దారులకుమధ్య ఘర్షణ జరగటం కమిషన్ వడ్డే వెంకటేశ్వర్లు పై దాడి చేయడం జరిగింది. అనంతరం రైతుల పై కూడా దాడి చేశారు. మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో మార్కెట్లో వివాదం కొనసాగుతుంది కాగా పోలీసులు మార్కెట్ కమిటీ రంగ ప్రవేశం చేసింది. సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మార్కెట్ని నిలిపివేయాలని చేస్తున్న ప్రయత్నాలు వివాదం కొనసాగుతుంది.