రైతన్నలకు కడుపు మండింది.. అందుకే ప్రధానికి చుక్కలు చూపించారు: షర్మిల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్ వ్యవహారంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా టాక్ నడుస్తోంది. దీనిపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతన్నల కడుపు మండిందని.. అందుకే వారు ప్రధాని మోదీకి చుక్కలు చూపించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా త్వరలోనే రైతులు బుద్ధి చెప్తారని… ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. అధికారం ఇస్తే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని షర్మిల మండిపడ్డారు.
Read Also: నాడు గ్రాఫిక్స్ అని తిట్టి… నేడు భూములు తాకట్టు పెట్టబోతున్నారు: సోమిరెడ్డి
Also Read
వ్యవసాయంపై కేంద్రం అనుసరిస్తున్న విధానం, మద్దతు ధర ఇవ్వకపోవడం, చట్టాలు వంటి అంశాల నేపథ్యంలోనే ప్రధాని మోదీని రైతులు అడ్డుకుని.. చివరకు వెనక్కి పంపించారని షర్మిల అభిప్రాయపడ్డారు. ఈ రైతులే రేపు సీఎం కేసీఆర్ అధికారం పట్ల కర్రుకాల్చి వాత పెడతారని హెచ్చరించారు. రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఈ ప్రభుత్వం రైతుకు చితి పేర్చుతోందని… వీధిన పడ్డ రైతుకు అండగా తాము రైతు ఆవేదన యాత్రతో ధైర్యాన్ని నింపుతున్నామని షర్మిల అన్నారు. అయితే తమ రైతు ఆవేదన యాత్రను ఆపడానికి కేసీఆర్ ప్రభుత్వం కరోనా రూల్స్ అడ్డుపెట్టి సంబరపడిపోతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా ముంచుకొస్తున్న మరో రైతాంగ పోరాటాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఈ చేతకాని సీఎం మనకొద్దని షర్మిల పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!