Dowleswaram Barrage: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. ముఖ్యంగా తూగో జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర క్రమేపి గోదావరి వరద నీటిమట్టం పెరిగిపోతుంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర 7. 80 అడుగులు వద్ద నీటిమట్టం చేరుకుంది. ఇక, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 9 అడుగులకు గోదావరి నీటిమట్టం కొనసాగుతుంది. బ్యారేజ్ నుంచి 5 లక్షల 9 వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి అధికారులు రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చెందిన 175 గేట్లు ఎత్తి వేసేశారు.
Read Also: Odisha : తాంత్రికపూజల పేరుతో యువతి తలలోకి 70 సూదులు.. బాబా అరెస్ట్
అయితే, మరోవైపు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర గేట్ల మధ్యలో ఓ బోటు ఇరుక్కుపోయింది. బ్యారేజీ మొదటి గేటు వద్ద ఈ ఘటన జరిగింది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో రేవులో లంగరు వేసి కట్టిన ఇసుక బోటు కొట్టుకుపోయింది. అయితే, ఆ బోటును గేటు దగ్గర నుంచి తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికంగా నీటి ప్రవాహం రావడంతో బోటును తీసేందుకు ఇబ్బందిగా మారిపోయింది.