Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద..
- ఎగువన కురుస్తున్న భారీవర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు..
- ఇప్పటికే నిండిన పలు ప్రాజెక్టులు..
- శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు భారీగా వరదనీరు..
- సాగర్ నిండుతుండడంతో ప్రాజెక్టు నుంచి ఇవాళ నీటివిడుదల..
- శ్రీశైలం డ్యామ్‌కు కాస్త తగ్గిన వరద..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Reservoir: భారీవర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూనే ఉంది.. పైన ఉన్నప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. దీంతో శ్రీశైలం నుంచి భారీగా వరదనీరు.. సాగర్‌కు వచ్చి చేరుతోంది. సాగర్ సైతం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉండడంతో.. ముందు జాగ్రత్తగా క్రస్ట్ గేట్లు తెరిచేందుకు ప్రాజెక్ట్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా…ఇప్పటికే 584 వద్ద కదలాడుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 290 టీఎంసీల నీరు ప్రాజెక్టులో చేరింది. అయితే, శ్రీశైలం జలాశయానికి వరద కాస్త తగ్గుముఖం పట్టింది.. ఇన్ ఫ్లో రూపంలో.. 3,46,410 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం డ్యామ్‌లో చేరుతోంది.. దీంతో.. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఔట్ ఫ్లో 3,74,676 క్యూసెక్కులుగా ఉంది.. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు అయితే.. ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటినిల్ల 204.7889 టీఎంసీలుగా ఉంది.. ఇక, కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది..
Read Also: Sravana Masam 2024: తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ సందడి.. పండుగలు.. శుభ ముహూర్తాలు ఇవే..
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
ఇక, నాగార్జున సాగర్‌కు ప్రస్తుత ఇన్ ఫ్లో 3,58,041 క్యూసెక్కులుగా ఉంది.. మొత్తం ఔట్ ఫ్లో 3,7485 క్యూసెక్కులు ఉంది.. ఇదే ఇన్ ఫ్లో మరి కొద్దిరోజులు కొనసాగే అవకాశం ఉండటంతో.. క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇప్పటికే కుడి కాలువకు 6700 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 4600 క్యూసెక్కులు.. జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం 1200 క్యూసెక్కులు, లో లెవెల్ కెనాల్ కు 320 క్యూసెక్కులను, విద్యుత్ ఉత్పత్తి కోసం 26 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి క్రస్ట్ గేట్ల ద్వారా దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో … నల్లగొండ, సూర్యపేట, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల కు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేశారు. క్రస్ట్ గేట్లను దాటుకొని వెళ్లే నీరు పులిచింతల ప్రాజెక్టు లోకి చేరుకునే అవకాశం ఉండడంతో… ప్రాజెక్టు అధికారులను కూడా అప్రమత్తం చేశారు.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటే.. నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువల ఆయకట్టు ఖరీఫ్, రబీ పంటలకు ఇబ్బందులు తొలగినట్లేననే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గతేడాది సాగర్ ఆయకట్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించగా… గత నెల 23 వ తేదీన 503 అడుగుల వద్ద 120 టీఎంసీల నీటి నిల్వతో ప్రాజెక్ట్ జంట నగరాలకు మాత్రమే తాగునీరు అందించింది. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో..తెలుగు రాష్ట్రాలలో 22 లక్షల ఆయకట్టుకు ఇబ్బందులు తొలగినట్లేననే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
తాజావార్తలు
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!