AP Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ వరద పరిస్థితులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం చాలా తేలిక.. కానీ, మా ప్రభుత్వం వచ్చి 100 రోజులు మాత్రమే అయింది.. బుడమేరు 90 శాతం ఆక్రమణలలో ఉంది అన్నారు. అదే శాపంగా మారి బెజవాడను వరద నీటితో నింపింది.. హైదరాబాద్ లో కూడా ఇలానే నీరు రాని ప్రాంతాల్లో ఇల్లు కట్టేశారు.. దశాబ్దాలుగా నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణం చేయడం వల్ల ఈలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పాడిందన్నారు. గత ప్రభుత్వ హయంలో కొంత పనైనా వైసీపీ చేయాల్సింది.. అనవసరంగా వైసీపీ నేతలు చంద్రబాబును విమర్శించడం తగదు.. ఈ వయసులో చేస్తున్న పనికి అభినందించాల్సిన విషయం.. విమర్శలు మానేసి వైసీపీ నేతలు ముందు సాయం చేసి మాట్లాడాలి.. నాతో పాటు వైసీపీ నేతలు వస్తే తీసుకుపోతాను.. అప్పుడు ఇబ్బందులు ఎంటి అనేది వాళ్ళకి అర్థం అవుతుంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Read Also: Spinach Benefits: పాలకూరను తినండి.. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టండి!
ఇక, ఇది అందరి సమస్యగా భావించి విమర్శలు మానుకోవాలి అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. నేను వస్తే సహాయక చర్యలకు ఇబ్బంది కాబట్టి నన్ను అధికారులు వద్దంటే ఆగిపోయాను..
దాదాపు 96 కోట్ల రూపాయలు రోడ్లు, డ్రైనేజీలు బాగు చేసేందుకు నిధులు కావాలన్నారు.. వైసీపీ హయంలో లాకులు రిపేర్ చేయలేదు, డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వలేదు అంటూ విమర్శించారు. కడప వెళ్తే లష్కర్ లు అక్కడ పరిస్థితిని వివరించారు.. గత ప్రభుత్వాలు అర్దం చేసుకుని మాట్లాడాలి.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ రెస్క్యూ టీమ్స్ బాగా పని చేస్తున్నారు.. 29 మంది వరదల వల్ల ప్రాణాలు కోల్పోయారు.. 200కు పైగా జంతువులు చనిపోయాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: ViswamTeaser : విశ్వంతో శ్రీనువైట్ల విశ్వరూపం చూపిస్తాడు : గోపించంద్
అలాగే, వరదల వల్ల 380 పంచాయితీలు ఎఫెక్ట్ అయ్యాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 175 టీమ్స్ ను విజయవాడకి కేటాయించాం.. ఒక్కో టీమ్ లో ఆరు మంది సభ్యులు ఉంటారు.. ఇందులో ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వంటి ఆరు మంది సభ్యులు ఉంటారు.. 685 టీమ్స్ ను దెబ్బతిన్న ప్రాంతాలకి పంపిస్తున్నామని తెలిపారు. ఇక, పంచాయితీ రాజ్ శాఖకు చెందిన 1.64 లక్షల మంది ఉద్యోగులు వరద సాయం కోసం రూ. 14 కోట్లు సహాయ నిధికి అందిస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పాటు వ్యాధులు ప్రబలకుండా క్లోరినేషన్ చేస్తున్నాం.. అవసరమైతే సూపర్ క్లోరినేషన్ చేయటానికి సిద్ధంగా ఉన్నాం.. హెవీ డ్యూట్ డ్రోన్స్ ను 8 కిలోల వరకు మోసే వాటిని వినియోగిస్తున్నాం.. పామర్రు, తోట్లవల్లూరు బ్రిడ్జీలు దెబ్బతిన్న కారణంగా 32 కోట్ల రూపాయలతో వరదల తర్వాత పనులు చేయిస్తాం.. 72 గంటలుగా క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు.. క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న శానిటేషన్ సిబ్బందిని గుర్తించి గౌరవిస్తాం.. సహాయక చర్యలు పూర్తయ్యాక శానిటేషన్ సిబ్బందిని సత్కరిస్తాం అని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు.