Vijayawada Floods: విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల అండగా ఉండాల్సింది పోయి.. కొందరు ప్రైవేట్ వ్యాపారులు దానికి క్యాష్ చేసుకుంటున్నారు. ఇంకా, వరద ప్రభావం నుంచి తేరుకోని విజయవాడను బుడమేరు వాగు నిండా ముంచేసింది. ఓవైపు ప్రజల ఆకలి కేకలు.. మరోవైపు వ్యాపారుల దోపడితో అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి ఏర్పాడింది. ప్రకృతి విపత్తుతో మానవత్వం మరిచి వ్యాపారం చేసుకుంటున్నారు. కేజీ బియ్యం 100 రూపాయలు, 35 రూపాయల అర లీటర్ పాల ప్యాకెట్ ను వంద రూపాయలకు అమ్ముతున్నారు. ఇఖ, ఫోన్ గంట సేపు ఛార్జింగ్ పెడితే రూ. 50 వసూలు చేస్తున్నారు. ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న డబ్బు ఖర్చు పెటాల్సిన పరిస్థితి ఏర్పాడింది. పడవ, ట్రాక్టర్ ప్రయాణానికి 2000 నుంచి 5000 రూపాయల వరకు పెట్టాల్సిన వస్తుంది. ఇలా ప్రైవేట్ వ్యాపారులు అడ్డగోలుగా నిలువు దోపిడి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Nani : శిల్పాకళావేదికలో సరిపోదా శనివారం విజయ వేడుక.. డేట్ ఎప్పుడంటే..?
మరోవైపు.. విజయవాడలోని సింగ్ నగర్ ఫ్లై ఓవర్ ప్రాంతంలో ఆహార పదార్థాలను వృథాగా పారవేస్తున్నారు. వరద బాధితులకు సాయం చేయాలన్న సీఎం చంద్రబాబు పిలుపుతో దాతలు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను తీసుకు వస్తున్నారు.. ఫ్లై ఓవర్ దగ్గర అధికారులకు అందజేస్తున్నారు. అయితే శివారు ప్రాంతాలకు ఆహారం సక్రమంగా పంపిణీ చేయక పోవటంతో మిగిలి పోయిన పదార్థాలను ఫ్లై ఓవర్ పైనే పారవేస్తున్నారు. ఓవైపు మూడు రోజులుగా ఆహారం లేక తాము ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ ఇలా వృథా చేయటం ఏంటని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వృథా అయిన ఆహారం కుళ్లిపోతే కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ముంపు ప్రాంత బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.