Harish Rao: తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. వచ్చే ఎన్నికల్లో విజేతలకు, అబద్ధాలకు మధ్య పోటీ ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఘాటుగా విమర్శించారు. గతంలో మత్స్యకారులు సభ్యత్వం పొందడం కష్టతరంగా ఉండేది.
తమిళనాడుకు చెందిన 9 మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకుంది. సముద్ర సరిహద్దును ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేశారని రాష్ట్ర మత్స్యశాఖ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. వారివద్ద నుంచి రెండు మెకనైజ్డ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. రామనాథపురం జిల్లాలోని మండపానికి చెందిన మత్స్యకారులు సోమవారం ఉదయం చేపల వేటకు వెళ్లగా నిన్న అర్థరాత్రి కచ్చతీవు- నెడుంతీవు మధ్య వారిని అరెస్ట్ చేశారు.
జైల్లో ఉన్న 199 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ శుక్రవారం విడుదల చేయనుంది. దేశ జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణతో 199 మంది భారతీయ మత్స్యకారులను పాక్ అరెస్ట్ చేసింది. వారిని శుక్రవారం విడుదల చేసేందుకు పాక్ అధికారులు సుహృద్భావ సంజ్ఞతో ముందుకు సాగాలని భావిస్తున్నారు.
శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన 16 మంది జాలర్లు, 102 మత్స్యకార బోట్లను త్వరగా విడుదల చేసేందుకు అవసరమైన దౌత్యపరమైన చర్యలను ప్రారంభించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
విశాఖ సాగరతీరంలో మత్స్యకారుల మధ్య మళ్లీ రింగు వలల వివాదం కొనసాగుతుంది. దీంతో గొల్లల ఎండాడ పెద్ద, జానంపేట తీరంలో పోలీసులు మోహరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా రెండు వర్గాలకు చెందిన బోట్లు నిలిపివేశారు. అటు ఇటు వెళ్లకుండా మధ్యలో కంచె వేశారు. సమస్య పరిష్కారం దిశగా మత్స్యకారులతో పోలీసులు, రెవిన్యూ, మత్స్య శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారు. read also: Love Marriage : ఖండాంతరాలు దాటిన ప్రేమ.. విశాఖలో మత్స్యకారుల మధ్య శుక్రవారం తెల్లవారుజామున…
సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల వలలకు ఎప్పటికప్పుడు అరుదైన చేపలు చిక్కుతూనే ఉంటాయి.. కొన్ని చేపలు వారు పొట్ట నింపుకోవడానికి ఉపయోగపడితే.. మరికొన్ని చేపలు కాసులు కురిస్తాయి.. ఇంకా కొన్నైతే.. బాగా డబ్బులు సంపాదించిపెడతాయి.. అయితే, ఇప్పుడు మత్స్యకారులకి చిక్కిన చేపను చూసిన తర్వాత.. అందరినీలోనూ భయం నెలకొంది.. ఆ చేప కనిపించడమే అపశకునమని.. ఇది భారీ ప్రమాదాలకు సూచిక అంటూ హడలిపోతున్నారు ప్రజలు.. అయితే, ఈ వ్యవహారం సోషల్ మీడియాకు ఎక్కింది.. అది భయపెట్టే…
మత్య్సకార సోదరుల మధ్య గొడవ దురదృష్టకరమైన సంఘటన అని ఏపీ పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సముద్రంలోకి లోపలికి వెళ్లి ఎవ్వరి బోట్లు వారే కాల్చుకుంటామంటే చట్ట ప్రకారం శిక్ష తప్పదని మంత్రి అన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాకుండా అందరిని కంట్రోల్‌లోకి తీసుకున్నామని మంత్రి తెలిపారు. Read Also: ఉద్యమాన్ని అణిచివేయడానికే…