ఏపీలో భారీ వర్షాల ప్రభావం కోస్తాలో బాగా కనిపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో భారీవర్షాలు టెన్షన్ పెడుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలతో గోదావరి ఉప్పొంగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. 14లక్షల 21వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద 14.60 అడుగులకు చేరిన నీటి మట్టం చేరింది. పి.గన్నవరం నియోజకవర్గంలోని నదీపాయల్లో గోదావరి వరద పెరుగుతోంది. కొండుకుదురు లంకలో నీటమునిగిన అక్కమ్మ తల్లి ఆలయం…ఏటిగట్టు సమీపంలో ఉన్న ఇళ్ళల్లోకి చేరింది వరదనీరు
Indane Gas Cylinder : మహిళలకు శుభవార్త.. ఇక బ్లాస్ట్ ప్రూఫ్ సిలిండర్లు..
ఇదిలా వుంటే.. అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్ళిన బోటు మునిగిపోయింది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని మత్స్యకారులు కొన్ని గంటల పాటు సహాయం కోసం ఎదురు చూశారు. సమాచారం అందుకున్న బోట్ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసింది. దీంతో 8మంది జాలర్లు ప్రాణాలతో బయటపడగా లక్షల రూపాయల విలువ చేసే బోటు దెబ్బతింది. నీట మునిగిన బోటును ఒడ్డుకు తరలించేందుకు శ్రమిస్తున్నారు.
ఈ రోజు తెల్లవారుజామున చేపల వేట ముగించుకుని తిరుగు ప్రయాణంలో వుండగా భీమిలి మండలం మంగమారి పేట దగ్గర ఒక్కసారిగా అలల ఉధ్ర్రతి పెరిగింది. దీంతో బోట్లోకి నీరు చొచ్చుకు రావడం తో మునిగిపోయింది. లక్షలు పెట్టుబడి పెట్టిన ఫిషింగ్ బోట్ దెబ్బతినడంతో ఓనర్ గగ్గోలు పెడుతోంది. మరోవైపు, పూడిమడక, విశాఖల నుంచి వేట కోసం వెళ్లిన సుమారు 30బోట్లు ఒడిషా సముద్రంలో చిక్కుకునిపోయాయి. గంజాం పోర్టులోకి అనుమతి ఇవ్వాలని కోరు తున్నప్పటికీ స్ధానిక అధికారులు స్పందించడం లేదు. భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వుంటే బోట్లు దెబ్బతినడంతో పాటు ప్రాణాలకు ముప్పు తప్పదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-10 ఆటగాళ్లు