VijaySai Reddy: ఏపీలో కోస్తా తీరానికి కోత ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి సుదీర్ఘమయిన సముద్రతీరం వుంది. తుఫానులు, భారీవర్షాలు కురిస్తే తీరప్రాంతం వణికిపోతుంటుంది. ఏపీలో కోస్తా తీరానికి కోత ముప్పు వుందని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కోత ముప్పు ఎదుర్కొంటున్న తీర ప్రాంతం 20 శాతం పైనే ఉన్నట్లుగా ఇంకాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్‌ఫర్‌మేషన్ సర్వీసెస్) అధ్యయనంలో తేలినట్లు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు.
రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలోని 43.35 శాతం తీరానికి అతి తక్కువగాను, 33.27 శాతం తీరానికి ఓ మోస్తరు కోత ముప్పు ఉన్నట్లుగా ఇన్‌కాయిస్ అధ్యయనం పేర్కొనట్లు తెలిపారు. కోత ముప్పు అతి తీవ్రస్థాయిలో ఉన్న ప్రాంతం 0.55 శాతం ఉన్నట్లు మంత్రి చెప్పారు. సముద్రమట్టం పెరగకుండా నియంత్రించే చర్యల కోసం జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఎంఎఫ్)కి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
దీనికి అదనంగా తీరప్రాంత కోత వలన నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించేందుకు జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరో వేయి కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. జాతీయ స్థాయిలో నేషనల్ డిసాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ సంస్థను నెలకొల్పి 2021-22 నుంచి 2025-26 కాలానికి ఈ సంస్థకు 68 వేల 463 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
ఈ నిధిని ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్డీఎంఎఫ్ సంస్థలకు 80-20 నిష్పత్తిలో విభజించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో ఎన్‌డీఎంఎఫ్‌ను నెలకొల్పింది. ఇలాంటి సంస్థలనే ఎస్‌డీఎంఎఫ్ పేరిట ఏర్పాటు చేయవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన సలహా మేరకు ఇప్పటికి 21 రాష్ట్రాలు ఎస్‌డీఎంఎఫ్‌లను ఏర్పాటు చేశాయని మంత్రి వివరించారు. సముద్ర కోతల వలన తీర ప్రాంతాలకు ఎదురవుతున్న ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు అందిస్తూ సాంకేతికపరమైన పరిష్కార మార్గాలను సూచిస్తున్నాయని ఆయన చెప్పారు.
Chandan Kumar: తెలుగు డైరెక్టర్స్ కే పొగరు చూపించిన కన్నడ హీరో.. చివరికి ఇలా
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!