విశాఖ సాగరతీరంలో మత్స్యకారుల మధ్య మళ్లీ రింగు వలల వివాదం కొనసాగుతుంది. దీంతో గొల్లల ఎండాడ పెద్ద, జానంపేట తీరంలో పోలీసులు మోహరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా రెండు వర్గాలకు చెందిన బోట్లు నిలిపివేశారు. అటు ఇటు వెళ్లకుండా మధ్యలో కంచె వేశారు. సమస్య పరిష్కారం దిశగా మత్స్యకారులతో పోలీసులు, రెవిన్యూ, మత్స్య శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారు.
read also: Love Marriage : ఖండాంతరాలు దాటిన ప్రేమ..
విశాఖలో మత్స్యకారుల మధ్య శుక్రవారం తెల్లవారుజామున వాసవానిపాలెంలో రింగు వలలతో కూడిన పడవలకు నిప్పు పెట్టడం, ఇది పెద్దజాలరిపేటకి చెందిన మత్స్యకారులే పనే అయ్యుంటుందని వారి మూడు పడవల్ని తీసుకురావడంతో వివాదం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, మత్స్యకార పెద్దలతో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తీరానికి తీసుకొచ్చిన పడవల్ని తిరిగి ఇచ్చేయాలని పోలీసులు కోరితే, తమ వలలకు నిప్పు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలంటూ వాసవానిపాలెం గ్రామపెద్దలు తేల్చి చెప్పారు. ఒకానొక సమయంలో పోలీసులు, అధికారులపై మత్స్యకారులు తిరగబడేందుకు సిద్ధమవ్వడంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో.. వాసవానిపాలెం, పెద్దజాలరిపేట గ్రామాల్లో 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చారు. ఐదు పోలీసు పికెటింగ్‌లను సైతం ఏర్పాటు చేశారు. శుక్రవారమే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించగా.. ఫలితం దక్కలేదు.