Blast in Firecracker Factory: అంబేడ్కర్ కోనసీమ జిల్లా గజపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో పేలుడు ఘటనకు మానవ తప్పిదమే కారణంగా విచారణ నివేదికలో వెల్లడైంది.. అక్టోబర్ 8వ తేదీన జరిగిన ఘోర పేలుడు ప్రమాదంపై అధికార విచారణ జరిపారు. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్, రంగాల ఐజీ రవికృష్ణల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీకి, జిల్లా యంత్రాంగం తాజా నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో, ఫ్యాక్టరీ…
New Year Celebrations: 2025 సంవత్సరంలోకి ప్రపంచ దేశాలు అడుగు పెట్టాయి. నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రజలు ఆనందోత్సాహాలతో బాణాసంచా కాల్చుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రజలు కేక్ కట్ చేస్తూ ఆనందంగా గడిపారు. చాలామంది భక్తులు దేవాలయాలను సందర్శించడం ద్వారా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించారు. పుణ్యస్నానాలు చేస్తూ, గడ్డకట్టే చలిని పట్టించుకోకుండా తెల్లవారు…
ప్రపంచంలో న్యూజిలాండ్ వాసులు 2025 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. గ్రాండ్‌గా కొత్త సంవత్సరం ఆరంభమైంది. పసిఫిక్ మహా సముద్రం కిరిబాటి దీవుల్లో మొట్ట మొదటిగా కొత్త సంవత్సరం ప్రారంభమైంది.
చిన్న పొరబాటు జరిగిన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగను పురస్కరించుకుని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని జాగ్రత్తలు సూచించింది. అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని కోరింది.
Railway Rules: దీపావళి పండుగ సమీపిస్తున్న సమయంలో ప్రజలు వారి ఇళ్లకు వెళ్లడం చేస్తుంటారు. దీని కారణంగా రైళ్లలో భారీ రద్దీ కనిపిస్తోంది. రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైలులో పటాకులు, పేలుడు సంభవించే వంటి వస్తువులను తీసుకెళ్లడంపై కఠిన నిషేధం ఉంది. ఈ నిబంధనల ప్రకారం రైలులో ప్రయాణికులు ఎలాంటి పటాకులను తీసుకెళ్లకూడదు. నిషేధిత వస్తువులతో ప్రయాణిస్తున్నట్లు తేలితే, అతను రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం చర్య తీసుకోవలసి ఉంటుంది.…
తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. తిరుపూర్ జిల్లాలో బాణాసంచా గోడౌన్ లో పేలుడు ప్రమాదం సంభవించింది. ఈ పేలుడు ధాటికి మూడు ఇళ్లు ధ్వంసం కాగా.. ముగ్గురు మృతి చెందారు, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఉత్తర్ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇస్లాంగర్ పట్టణంలోని బాణాసంచా గోదాములో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ ఇల్లు చెల్లాచెదురైంది. ప్రమాదం జరిగిన బాణసంచా గోదాము బిల్సీ రోడ్డులో ఉంది. అయితే.. ఈ ప్రమాదంలో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అందరు భావిస్తున్నారు.
ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ దీపావళి సందర్భంగా “పిల్లల కోసం” బాణాసంచాపై నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఒక ఇంటర్వ్యూ వీడియోను ట్వీట్ చేశారు. మీరు జంతు ప్రేమిగల, పర్యావరణ పరంగా సున్నితమైన మానవులైతే, మీరు రోజువారీ మాంసాహారాన్ని తగ్గించాలి. ఒక రోజు ఆనందంగా పిల్లలు దానిని తిననివ్వండి” అని సద్గురు ట్వీట్ చేశారు. ప్రతిరోజూ మన ఆహారం కోసం ఈ గ్రహం మీద 200 మిలియన్లకు పైగా జంతువులను వధిస్తున్నాము” అని, “జంతువులు, పక్షులకు…
తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 10 మంది మంటల్లో చిక్కుకోగా ఐదుగురు సజీవ దహనం అయ్యారు. కాగా పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తమిళనాడులోని కల్వాకుర్చి జిల్లా శంకరాపురంలోని బాణాసంచా గోడౌన్ లో పేలుడు సంభవించింది. మరో 10 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదం పై సమాచారం రాగానే ఫైర్ సిబ్బంది రెస్క్యూటీం.. సహాయ చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. కాగా, భారీ మంటలు ఎగిసిపడుతుండటంతో సహాయక…