Blast in Firecracker Factory: అంబేడ్కర్ కోనసీమ జిల్లా గజపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో పేలుడు ఘటనకు మానవ తప్పిదమే కారణంగా విచారణ నివేదికలో వెల్లడైంది.. అక్టోబర్ 8వ తేదీన జరిగిన ఘోర పేలుడు ప్రమాదంపై అధికార విచారణ జరిపారు. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్, రంగాల ఐజీ రవికృష్ణల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీకి, జిల్లా యంత్రాంగం తాజా నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో, ఫ్యాక్టరీ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్పష్టం చేశారు. సిద్ధమైన బాణసంచాను గిడ్డంగికి తరలించకుండా తయారీ కేంద్రంలోనే నిల్వ చేయడంతో పేలుడు తీవ్రత పెరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో అక్కడున్న బాధితులు, మునుపు పని చేసిన కార్మికులు, బాధితుల బంధువులు, స్థానికులు సహా దాదాపు 70 మందిని పోలీసులు విచారించారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా, సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకునే ప్రక్రియ వేగంగా సాగుతోందని అధికారులు చెబుతున్నారు.
Read Also: PM Modi: బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్న మోడీ.. ఎప్పటినుంచంటే..!