Diwali Festival: దీపావళికి యావత్ దేశం రెడీ అయింది. వాకిట్లో దీపాల కాంతులు.. గుమ్మం ముందు బాణాసంచా పేలుళ్లు.. చిన్నారుల కేరింతలతో దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ దీపావళి పండుగ సందర్భంగా చిన్నా పెద్దా, ముసలీ ముతకా అందరూ టపాసులు, బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటారు. అయితే, ఈ సంబరాల సమయం విషాదంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. చిన్న పొరబాటు జరిగిన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగను పురస్కరించుకుని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని జాగ్రత్తలు సూచించింది. అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని కోరింది.
Read Also: Jai Hanuman: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. బాక్స్ ఆఫీస్ ఊపిరిపీల్చుకోవాలమ్మా !
దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* బాణాసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించండి.
* వీలైనంత వరకు దీపాలను మాత్రమే పెట్టండి.
* మీ ఇంటి కిటికీలు, తలుపులు మూసివేయండి.. పసి పిల్లలు ఉంటే ఇంటి లోపలే ఉంచండి.
* పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పిల్లలు బాణాసంచా కాల్చవలెను.
* బాణసంచా కాల్చేటప్పుడు ఒక బకెట్ నీరు, ఇసుకను అందుబాటులో ఉంచుకోండి.
* బాణాసంచాతో ప్రయోగాలు చేయొద్దు.. అవి కాల్చేపుడు మీ ముఖాన్ని దూరంగా ఉంచండి.
* కాల్చడంలో విఫలమైన బాణసంచాను మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయొద్దు.
* ఫైర్ క్రాకర్‌లను వెలిగించి విచక్షణా రహితంగా బహిరంగంగా విసిరేయకండి.
* ప్రమాదకర టపాసులు లాంటి బాణాసంచా కాల్చే సమయంలో చేతితో పట్టుకోవద్దు.