Istanbul: టర్కీ ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా.. 8 మంది గాయపడినట్లు నగర గవర్నర్ తెలిపారు.
Vaishali Express : ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో రెండో భారీ రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఢిల్లీ నుంచి సహర్సా వెళ్తున్న వైశాలి ఎక్స్‌ప్రెస్ నంబర్ 12554లో మంటలు చెలరేగాయి. ప్యాంట్రీ కారు సమీపంలోని ఎస్6 కోచ్ బోగీలో ఈ ఘటన జరగ్గా, 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని అత్తిబెలెలోని ఓ బాణసంచా దుకాణంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో షాపు యజమాని సహా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోచింగ్ సెంటర్ మంటలు చెలరేగడంతో ప్రాణాలు రక్షించుకునేందుకు విద్యార్థులు తాడు సాయంతో కిందికి దూకారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.
ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనను మరువకముందే మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సీల్దా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లలో ఒకదానిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనను మరువకముందే మరో ఘటన జరిగింది. ఒడిశాలోని బెర్హంపూర్ స్టేషన్ వద్ద సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Rajastan : రాజస్థాన్ లోని దుంగార్ పూర్ మెడికల్ కాలేజీలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దుంగార్ పూర్ లో ఉన్న ఈ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది.
రష్యాలోని ఓ వృద్ధుల గృహంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సైబీరియాలోని కెమెరోవో నగరంలో వృద్ధుల గృహంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించి 20 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.