Fire Accident: కర్ణాటక రాజధాని బెంగళూరులోని అత్తిబెలెలోని ఓ బాణసంచా దుకాణంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో 13 మంది చనిపోయారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయి. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న తర్వాత అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
బాణాసంచా దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది మరణించారనే వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి స్వయంగా సందర్శించనున్నట్లు సమాచారం. రేపు ప్రమాద స్థలికి వెళ్లి పరిశీలిస్తానని సీఎం చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు వ్యక్తులు గాయపడ్డారు.
శనివారం సాయంత్రం బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగడంతో 13 మంది మృతి చెందినట్లు, పలువురు గాయాల పాలైనట్లు బెంగళూరు రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మల్లికార్జున్ బాలదండి తెలిపారు. ఘటనా స్థలానికి ఐదు అగ్నిమాపక యంత్రాలు పంపినట్లు పోలీసు అధికారి తెలిపారు. అలాగే మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.
#WATCH | Karnataka: Fire broke out at a firecracker shop in Attibele. Several fire tenders were present at the spot. Further details awaited. pic.twitter.com/HcAzWItPVZ
— ANI (@ANI) October 7, 2023