సోమాజిగూడ లోని శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్ కిచెన్ నుండి దట్టంగా పొగలు వెలువడ్డాయి. బిల్డింగ్ అయిదవ అంతస్తులో రెస్టారెంట్ ఉంది. భవనం నాలుగో అంతస్తులో GRT జ్యూవెలర్స్ ఉంది. అయిదవ అంతస్తులో ఉన్న రెస్టారెంట్ నుండి పొగలు వెలువడ్డాయి. దీంతో అంతా భయాందోళనకు గురయ్యారు. ఉద్యోగులు, ఇతర పనులకు వెళ్లిన వారు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో అగ్నిప్రమాదం ఆందోళన కలిగించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి ఫైర్,…
మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రాణ నష్టం ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎంతమేరకు ఆస్తినష్టం జరిగిందో ఇంకా…
పెట్రోల్ బంకుల్లో సెల్ ఫోన్ వాడే క్రమంలో, అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగడం చోటుచేసుకుంటాయి. తాజాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్ లో గల పెట్రోల్ బంక్ లో ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోస్తుండగా బైకులోంచి మంటలు చెలరేగాయి. దీంతో వాహనదారుడు, బంకు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన వాహనదారుడు పెట్రోల్ పోసే పైపును ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ నుంచి తీసి కిందపడేశాడు. వెంటనే అక్కడే ఉన్న పెట్రోల్…
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో హిసార్-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి, ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి మరియు వందే భారత్ రైలు సకాలంలో ఆగిపోయింది. రాజస్థాన్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి నడుస్తున్న హిసార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి, ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి.
Fire Breaks Out: ముంబైలోని ఫిల్మ్ సిటీలో సోమవారం ఉదయం ఓ సీరియల్ సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదిక లేదని వారు తెలిపారు. అనుపమాలోని టెంట్ ప్రాంతంలో మంటలు చెలరేగాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక దళానికి సమాచారం అందింది. దానితో వెంటనే గోరేగావ్ (తూర్పు) ప్రాంతం లో ఉన్న ఫిల్మ్ సిటీలోని దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరిలో ఉన్న మరాఠీ…
ఓ వైపు రోడ్డు ప్రమాదాలు.. ఓ వైపు విమాన ప్రమాదాలు, మరోవైపు రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అనుకోకుండా చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చాలామంది గాయాలపాలవుతున్నారు. తాజాగా ఓ రైలులో మంటలు చెలరేగాయి. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న 127 69 నెంబర్ గల సెవెన్ హిల్స్ రైలు చిగిచెర్ల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు చివరి భాగంలో గార్డు భోగి కంటే ముందు భోగి వద్ద బ్రేకులు పడి మంటలు…
తిరుమలలో కారులో మంటలు చెలరేగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.. ఆర్టీసీ బస్టాండ్ వద్ద కారు దగ్ధమైంది.. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో భక్తులు పరుగులు తీశారు.. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపుచేశారు.. అప్పటికే మంటల్లో కారు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది.
హైదరాబాద్లోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Fire Accident : జార్జియాలో సోమవారం ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు. పిల్లలు 6, 12, 13 సంవత్సరాల వయస్సు గలవారని కోవెటా కౌంటీ కరోనర్ కార్యాలయం తెలిపింది.
Istanbul: టర్కీ ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా.. 8 మంది గాయపడినట్లు నగర గవర్నర్ తెలిపారు.