శ్రీకాకుళం జిల్లాలో ఘోర పేలుడు సంభవించింది. శ్రీకాకుళం జిల్లా లెక్కలి పట్టణంలోని కచేరీ వీధిలోని ఓ ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా.. పేలుడు చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘోర ప్రమాదం లో ఏకంగా ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి సాయి మరియు హరిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.
గాయాల పాలైన ఇద్దరు చిన్నారులను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇక విషయం తెలిసిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరకుని… దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇంట్లో భారీ పేలుడు సంభవించడంతో ఆ వీధి లోని స్థానికులు అందోళన చెందుతున్నారు. కాగా.. ఏపీలో టాపాకాయలు పేల్చడంపై జగన్ సర్కార్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.