మహరాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. అహ్మద్‌నగర్ జిల్లా ఆసుపత్రి ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐసీయూలో కరోనా వార్డులో 17 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.
వారిలో ఆరుగురు మృతి చెందగా.. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అందుపులోకి తీసుకువచ్చాయి. షాట్ సర్య్కూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించిందని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.