పరుపుల గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైలార్ దేవ్ పల్లి వినాయకనగర్ బస్తీలోని పరుపుల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మంటలను చూసిన స్థానికులు అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగ కమ్మేయడంతో బస్తీ వాసులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు.
గోడౌన్‌లో కాటన్ కు సంబంధించిన వస్తువులు వుండడంతో మంటలు క్షణాల మీద వ్యాపించాయి. పరిశ్రమలో పెద్ద ఎత్తున ఎగసి పడుతున్న మంటలను చూసి కాలనీ వాసులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు 8 లక్షల మేరా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. అయితే పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. బస్తీ మధ్యలో నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమ కొనసాగిస్తున్నట్లు బస్తీ వాసుల ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఈ నేపథ్యంలో అనుమతులు లేని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు సంభవిస్తే జరగరాని ప్రాణ నష్టం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ స్థానికులు వాపోయారు. పరిశ్రమ యజమాని పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, వెంటనే పరిశ్రమ జనావాసాల మధ్య నుండి తొలగించాలని స్థానికులు కోరారు.

తాజావార్తలు
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!