విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మెంటాడ మండలంలోని జక్కువ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని కోట పోలినాయుడు అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో మంటలు చేలరేగాయి. దీంతో ఒక్కసారి మంటల ఎగిసిపడ్డాడడంతో పక్కనే ఉన్న 20 పూరిళ్ల కు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్దమయ్యాయి.
అంతేకాకుండా పూరిళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా పేలుతున్నాయి. సిలిండర్ పేలుళ్ల శబ్దాలతో ప్రజలు పరుగులు తీశారు. ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందటంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.