విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బీఎఫ్ యూనిట్‌లో ఉక్కుద్రవం నేలపాలైంది. ఉక్కుద్రవం నేలపై పడిన వెంటనే మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు అంటుకోవడంతో బీఎఫ్ యూనిట్ మంటల్లో చిక్కుకుపోయింది. అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీఎఫ్ యూనిట్‌లోని కీలక వస్తువులు మంటల్లో కాలిపోవడంతో సుమారు 50 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదం పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నది. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వివిధ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఉక్కు కార్మికులకు మద్దతు ప్రకటించాయి.
Read: అలర్ట్: ప్రపంచంలో నాలుగో వేవ్ నడుస్తోంది… నిబంధనలు అతిక్రమిస్తే…