హైదరాబాద్‌లోని చాదర్ ఘాట్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా… 40 గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. పుట్ పాత్… దగ్గర వేసుకుని.. ఉన్న గుడిసెల్లోని ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న గుడిసెలకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్ని ప్రమాదం ధాటికి గుడిసెల్లో ఉన్న సిలిండర్లు కూడా పేలాయి.దీంతో అగ్ని ప్రమాదం తీవ్రత పెరిగి పక్కపక్కనే ఉన్న 40 గుడిసెలు దగ్ధం అయ్యాయి.
Read Also:దేశ తలసరి ఆదాయం కన్నా.. రాష్ర్ట ఆదాయం పెరిగింది: మంత్రి ఎర్రబెల్లి
సిలిండర్లు పేలడంతో.. గుడిసెల దగ్గర ఉన్నవాళ్లు.. పక్కనే ఉన్న ప్రజలు భయంతో.. పరుగులు తీశారు. భారీ అగ్ని ప్రమాదం వల్ల గుడిసెల్లోని నిత్యావసర వస్తువులు, ఇతర సామాన్లు కాలి బూడిద అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్ని మాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేసింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో… సహాయక చర్యలు జరుగుతున్నాయి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.