New Banking Rules: ప్రతి ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ముందు చాలా బ్యాంకులు కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొస్తుంటాయి. ప్రతి కొత్త ఆర్థిక ఏడాది లాగే ఈ ఏడాది కూడా కొన్ని రూల్స్ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దేశంలోని ప్రముఖ బ్యాంకులు తమ నిబంధనల్లో మార్పులను ప్రకటించాయి. ఈ మార్పులు ప్రధానంగా సేవింగ్స్ అకౌంట్లు, ఏటీఎం లావాదేవీలు, క్రెడిట్ కార్డులు, ఇతర బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించినవిగా ఉన్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ, కానరా…
New Year 2023: ఇండియాలో గతేడాది 46 కంపెనీలు యూనికార్న్ హోదా పొందగా ఈ సంవత్సరం 22 సంస్థలే ఈ స్టేటస్ సాధించాయి. అంటే కొత్త యూనికార్న్‌ల సంఖ్య సగం కన్నా తక్కువకు పడిపోయింది. అయితే.. ఫ్యూచర్ యూనికార్న్‌లు ఈ ఏడాది భారీగానే పెరిగాయి. ఈ విషయాలను రెండు వేర్వేరు సంస్థల నివేదికలు వెల్లడించాయి. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా అమెరికా మరియు చైనా తర్వాత 3వ అతిపెద్ద స్టార్టప్స్ అండ్ యూనికార్న్స్ ఎకోసిస్టమ్‌గా ఇండియా ఎదగటం విశేషం.
Small Loans-Better Payments: ‘‘చిన్న కుటుంబం.. చింతల్లేని కుటుంబం..’’ అంటారు కదా. ఆ మాటను.. బ్యాంక్ లోన్లకు కూడా వర్తింపజేయొచ్చనిపిస్తోంది. ఎందుకంటే.. చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకున్నవాళ్లు చెల్లింపులను తూచా తప్పకుండా చేస్తున్నారు. ముద్ర అనే కేంద్ర ప్రభుత్వ పథకం కింద లోన్లు తీసుకున్న కస్టమర్లను దీనికి ఉదాహరణగా చూపొచ్చు. 2015లో ప్రారంభించిన ఈ స్కీమ్‌లో భాగంగా 3 రకాల రుణాలు మంజూరు చేస్తారు.
Indian Currency Look: ప్రస్తుతం మన కరెన్సీ నోట్ల పైన ఒక వైపు జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మ, మరోవైపు చారిత్రక కట్టడాల బొమ్మలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నోట్ల లుక్ భవిష్యత్‌లో మారనుందా అనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొదలైంది. డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు ప్రతిరూపంగా పూజించే లక్ష్మీదేవితోపాటు కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించే గణేషుడి బొమ్మలు వస్తాయా అని ప్రజలు అనుకుంటున్నారు.
Gland Pharma Results: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించే గ్లాండ్ ఫార్మా సంస్థ సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో 302 కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించిన ఈ కంపెనీ ఈసారి 20 శాతం తక్కువగా అంటే 241 కోట్ల నికర లాభంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సంస్థ మొత్తం ఆదాయం సైతం 2 శాతం తగ్గి రూ.1,110 కోట్లకే పరిమితమైంది.
UDAN Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఉడాన్ పథకంలో భాగంగా గత ఐదేళ్లలో లక్షన్నరకు పైగా విమానాలను ప్రారంభించామని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. విమానయాన పరిశ్రమను ప్రజాస్వామ్యీకరించామని అన్నారు.
Paytm Net Loss: జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో పేటీఎం నికర నష్టం మరింత పెరిగింది. గతేడాది 380 కోట్ల రూపాయలు నష్టం రాగా అది ఈసారి 644 కోట్లకు చేరింది. అదే సమయంలో ఆదాయం 89 శాతం పెరిగి 16 వందల 80 కోట్లుగా నమోదైంది. గతేడాది జూన్ నాటికి వచ్చిన రెవెన్యూ 891 కోట్లు మాత్రమేనని సంస్థ వెల్లడించింది. డిజిటల్ ఫైనాన్సియల్ సర్వీసుల రంగంలో పేరొందిన పేటీఎంకి ఆదాయం పెరిగినా నష్టాలు తగ్గలేదని…
Loans Write Off: గడచిన ఐదేళ్లలో బ్యాంకులు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల లోన్లను టెక్నికల్‌గా రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. గత నాలుగేళ్లలో 10 వేల 306 మంది ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె.కరాడ్ రాతపూర్వకంగా తెలిపారు.
Rice Rates: మన దేశంలో అన్ని రకాల బియ్యం ధరలు జూన్ నెల నుంచి ఇప్పటిదాక 30 శాతం వరకు పెరిగాయి. విదేశాల నుంచి బియ్యానికి డిమాండ్ పెరగటంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో వరి పంట సాగు విస్తీర్ణం తగ్గటంతో ఈ పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా తదితర దేశాలకు
OPPO Company: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పొ మన దేశంలో 475 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. విహాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఇన్వెస్ట్మెంట్ చేయనుంది. వచ్చే ఐదేళ్లలో కంపెనీ వార్షిక ఎగుమతుల సామర్థ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచేందుకు