Gland Pharma Results: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించే గ్లాండ్ ఫార్మా సంస్థ సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో 302 కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించిన ఈ కంపెనీ ఈసారి 20 శాతం తక్కువగా అంటే 241 కోట్ల నికర లాభంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సంస్థ మొత్తం ఆదాయం సైతం 2 శాతం తగ్గి రూ.1,110 కోట్లకే పరిమితమైంది.
Money Prasad in Temple : దేవుడి ప్రసాదంగా డబ్బులు పంచుతున్నరు.. భక్తులారా త్వరపడండి
టోటల్ రెవెన్యూలో ఇండియన్ మార్కెట్ వాటా 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గగా అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా వాటా ఏకంగా 72 శాతానికి పెరిగినట్లు గ్లాండ్ ఫార్మా వెల్లడించింది. తాజాగా ముగిసిన ప్రథమార్ధంలో మొత్తం ఆదాయం రూ.2041.3 కోట్లుగా, నికర లాభం రూ.470.4 కోట్లుగా పేర్కొంది. కంపెనీ పెట్టుబడులు రూ.41 కోట్లని గ్లాండ్ ఫార్మా సీఈఓ శ్రీనివాస్ సాదు తెలిపారు. రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) యాక్టివిటీస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
6 డ్రగ్స్‌కి అబ్రివియేటెడ్ న్యూడ్రగ్ అప్లికేషన్ (ఏఎన్‌డీఏ) దాఖలు చేశామని, ఈ ఔషధాలకు ఎక్కువ పోటీ నెలకొందని అన్నారు. కొత్త మందులను మార్కెట్లోకి తీసుకురావటం ద్వారా స్థిరమైన వృద్ధి సాధించే ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. బయోలాజిక్స్‌తోపాటు బయోసిమిలర్ సీడీఎంఓ బిజినెస్ డివిజన్‌లో కొంత పాజిటివ్ వాతావరణం ఉందని, అగ్రరాజ్యం అమెరికాలో పార్ట్నర్ కంపెనీలతో కలిసి ఏకంగా 322 ఏఎన్‌డీఏ దరఖాస్తులు సమర్పించగా 259 అప్లికేషన్లకు పర్మిషన్ వచ్చిందని శ్రీనివాస్ సాదు చెప్పారు.