OPPO Company: చైనా కంపెనీ ‘ఒప్పొ’ చూపు.. ఇండియా వైపు. రూ.475 కోట్ల పెట్టుబడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Company: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పొ మన దేశంలో 475 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. విహాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఇన్వెస్ట్మెంట్ చేయనుంది. వచ్చే ఐదేళ్లలో కంపెనీ వార్షిక ఎగుమతుల సామర్థ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 5జీ లాంటి నెక్‌స్ట్ జనరేషన్ టెక్నాలజీల డెవలప్మెంట్ పైన కూడా ఫోకస్ పెట్టనున్నట్లు పేర్కొంది.
5వ రోజూ ‘5జీ’ వేలం
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
5జీ స్పెక్ట్రం వేలం ఇప్పటికి 4 రోజులు పూర్తయింది. ఇవాళ 5వ రోజు కూడా ఆక్షన్ జరగనుంది. నిన్న 4వ రోజు వేలంలో 231 కోట్ల రూపాయలకు పైగా విలువైన బిడ్లు దాఖలయ్యాయి. వేలానికి ఉంచిన మొత్తం స్పెక్ట్రంలో 71 శాతానికి అప్లికేషన్లు వచ్చాయని టెలికం శాఖ మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఇప్పటివరకు జరిగిన మొత్తం 17 రౌండ్ల వేలంలో లక్షా 49 వేల 855 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయని చెప్పారు.
Jail Term: శిక్షా కాలం ముగిసిన తర్వాత కూడా నాలుగేళ్లపాటు జైల్లోనే. అసలేం జరిగింది?
ఐటీఆర్‌లకు రేపే లాస్ట్
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించేందుకు రేపు ఆదివారమే ఆఖరు తేదీ. ఈ నేపథ్యంలో గడువు పొడిగిస్తారేమోనని ఐటీ చెల్లింపుదారులు ఎదురుచూస్తున్నారు. కానీ గడువు పెంచే అవకాశం లేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఇప్పటికే తేల్చిచెప్పారు. దీంతో మొన్న గురువారం ఒక్క రోజే 36 లక్షలకు పైగా ఐటీఆర్‌లు వచ్చాయి.
తగ్గని ‘యూరో’ ద్రవ్యోల్బణం
యూరో జోన్‌లోని 19 దేశాల్లో వార్షిక ద్రవ్యోల్బణం ప్రతి నెలా పెరుగుతోంది. ఈ నెలలో రికార్డ్ స్థాయిలో 8.9 శాతానికి చేరింది. 1997 తర్వాత ఇదే అత్యధికం కావటం అక్కడి ప్రజలకు, పాలకులకు ఆందోళన కలిగిస్తోంది. జూన్ నెలలో కూడా ద్రవ్యోల్బణం 8.6 శాతంగా నమోదైంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ దేశాల్లో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణం దిగిరాకపోవటానికి ఇదే ప్రధాన కారణం.
ఓలా, ఉబర్ విలీనం!
క్యాబ్ సర్వీసుల రంగంలో టాప్‌లో నిలిచిన ఓలా, ఉబర్ కంపెనీలు రెండూ భవిష్యత్తులో ఒక్కటి కానున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఇరు వర్గాలు చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఓలా వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆ సంస్థ సీఈఓ భవిశ్ అగర్వాల్ రీసెంటుగా ఉబర్ మేనేజ్మెంట్‌తో సమావేశమైనట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. ఓలా, ఉబర్ విలీనంపై నాలుగేళ్ల కిందట కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఫారెక్స్ నిల్వల పతనం
ఇండియాలో విదేశీ మారక నిల్వల పతనం కొనసాగుతోంది. 22వ తేదీతో ముగిసిన వారంలో 115 కోట్ల డాలర్లకు పైగా ఫారెక్స్ నిల్వలు తగ్గాయని ఆర్‌బీఐ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం 57 వేల 156 కోట్ల డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు వారంలో ఫారెక్స్ నిల్వలు భారీ స్థాయిలో 754 కోట్ల డాలర్లు పడిపోయాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!