Kamareddy Master Plan: కామారెడ్డిలో ఉద్రిక్తత.. షబ్బీర్ అలీ సహా 100 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతుల బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. ఇందిరా చౌక్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. షబ్బీర్ అలీ, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ శ్రేణుల ధర్నా ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కిసాన్ కేత్ జాతీయ నేత కోదండ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి సహా 100 మంది కార్యకర్తల అదుపులో తీసుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే.. షబ్బీర్ అలీని తరలించే వాహనానికి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి అడ్డుకున్నారు. పోలీస్ వాహనంలో షబ్బీర్ అలీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా..కొత్త మాస్టర్ ప్లాన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాని రైతు జేఏసీ ఇవాళ కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు కాగ్రెస్ ,బీజేపీలు మద్దతు ప్రకటించాయి. నేడు ఉదయం నుండి రైతు జేఏసీ నేతలు, కాంగ్రెస్, బీజేపీ సహా పలువురిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాల కామారెడ్డి బంద్ కు జేఏసీ పిలుపు నివ్వడంతో కామారెడ్డికి వచ్చే రూట్లన్నీ బంద్ చేసి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read also: Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత.. DSP రవీంద్రా రెడ్డి తో వాగ్వాదం
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
నిన్న రైతుల ఆందోళనను జిల్లా కలెక్టర్ అవమానపరిచారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సవరిస్తామని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరు దున్నపోతు పై వర్షం పడ్డట్లు ఉందని విమర్శించారు. మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రభుత్వం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. కామారెడ్డి లో రైతుల భూముల్లో ఇండస్ట్రియల్ ప్రతిపాదన రద్దు చేయాలని, మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు మంత్రి కేటిఆర్ ప్రకటన చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఇక కామారెడ్డి బంద్ కు మద్దతుగా అడ్లూరు ఎల్లారెడ్డి రైతుల ప్రదర్శన నిర్వహించారు. కామారెడ్డి కొత్త బస్టాండ్ ప్రాంతంలో రైతలను అదుపులో తీసుకున్న పోలీసులు. దీంతో అక్కడ ఉత్రిక్త వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!