Harish Rao: తెలంగాణ భూముల రేట్లు పెరగడానికి కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు సర్టిఫికెట్లు అందజేశారు. సంగారెడ్డి జిల్లా లో 86% ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఏఎన్ఎం,ఆశా వర్కర్లను అభినందించారు. దిగ్వాల్ లో ఈ ఇళ్లను చూస్తుంటే హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీ లాగా అనిపిస్తుందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇండ్లు చూసారా? అప్పట్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రావాలంటే లంచాలు ఇచ్చేవారు.. కానీ ఇప్పుడు ఎవ్వరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. ఇంటి అడుగు స్థలం వున్నా వారికి కూడా త్వరలో డబ్బులు ఇస్తామన్నారు హరీష్ రావు.
మాజీ మంత్రి గీతారెడ్డి హయాంలో త్రాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి జహీరాబాద్ ది అంటూ సంచళవాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలలో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా టాప్ లో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. రేపటి నుంచి రైతు బంధు నిధులు విడుదల చేస్తామన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రలలో తెలంగాణలో ఉన్నట్టు వంటి సంక్షేమ పధకాలు ఎక్కడ లేవని గుర్తు చేశారు. తొందరలో సంగమేశ్వర, బస మేశ్వర సాగునీరు ప్రాజెక్ట్ లను ప్రారంభించి గోదావరి జలాలను జహీరాబాద్ కి తీసుకొస్తామన్నారు. తెలంగాణ భూముల రేట్లు పెరగడానికి కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అంటూ మంత్రి తెలిపారు. పక్కనే ఉన్న కర్ణాటకలో 7 లక్షలకు ఎకరం భూమి వస్తుంది..మన దగ్గర ఎకరం కోటిపైన పలుకుతుందని అన్నారు మంత్రి. స్వయానా డాక్టర్ అయినా గీతా రెడ్డి తానూ మంత్రిగా వున్నా కూడా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని పట్టించుకోలేదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Read also: Woman SI Affair: డ్రైవర్‌తో మహిళా ఎస్సై రాసలీలలు.. కొడుకుతో కలిసి..
ఇక యాసంగికి సంబంధించి బుధవారం నుంచి రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం అందనుంది. ఆ రోజు ఉదయం నుంచి రైతుబంధు పైసలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ సీజన్‌లో దాదాపు 66 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.7,600 కోట్లను పెట్టుబడి సాయంగా పంపిణీ చేయనుంది. రైతుబంధు కోసం అవసరమైన నిధులు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. రైతు బంధు చివరి రైతుకు పెట్టుబడి సాయం అందించాలని, అర్హులైన వారెవరూ నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడి సాయం పంపిణీపై వ్యవసాయ, ఆర్థిక శాఖల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గత వానాకాలం సీజన్‌లోనే రూ.50 వేల కోట్ల మార్క్‌ను దాటిన రైతుబంధు సాయం ఈ సీజన్‌తో రూ.65 వేల కోట్లకు చేరడం గమనార్హం.
Today (27-12-22) Business Headlines: సామాన్యుడి బండి.. సరికొత్తగా. మరిన్ని ముఖ్య వార్తలు