మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాల్వాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళను వెంటపడి వేధిస్తున్నాడు ఓ యువకుడు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవాలని ఇబ్బందికి గురి చేస్తున్నాడు. దానికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో.. యువతితో పెళ్లి అయినట్లు సర్టిఫికేట్ తయారు చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేసారు.
Bandi Sanjay Demands KCR Resgination Over Fake Certificates: నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం.. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమని పేర్కొన్నారు. నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో పాస్‌పోర్ట్ పొంది.. ఉగ్రవాదులందరూ పాతబస్తీలో పాగా వేస్తున్నారని వ్యాఖ్యానించారు. పాతబస్తీ ఐఎస్ఐ అడ్డాగా మారిందని అన్నారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా..…
నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠాను మాదాపూర్ ఎస్వోటి పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గచ్చిబౌలి సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. 11 మంది అరెస్ట్ చేసామని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి భారీగా నకిలీ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు కోట కిషోర్ కుమార్ తో పాటు 10 మందిని అదుపులో తీసుకున్నట్లు పేర్కొన్నారు. సుమారు 18 యూనివర్సిటీ లకు…
విశాఖ జిల్లా పాయకరావుపేటలో కులధ్రువీకరణ పత్రాల స్కాం వెలుగుచూసింది. పాయకరావుపేట నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా బీసీ-డి కులానికి చెందిన కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. ధృవీకరణ పత్రాలలో తప్పులు రావడంతో తహసీల్దార్ అంబేద్కర్‌ను బాధితులు ఆశ్రయించారు. అధికారుల పరిశీలనలో ఇవి నకిలీవిగా స్పష్టం కావడంతో అసలు విషయం బహిర్గతం అయ్యింది. విశాఖ కేంద్రంగా 27 మీ సేవా కేంద్రాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి. అయితే తనకు సంబంధం లేకుండా నకిలీ ధ్రువపత్రాలను మంజూరు…
తెలంగాణలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు ఓయూ విద్యార్థి నాయకులు.. ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్లతో అమెరికాలో చదువుతున్న ముద్దం స్వామిపై సీపీకు ఫిర్యాదు చేశారు.. ఇక, నకిలీ సర్టిఫికెట్ వ్యవహారాన్ని ఉస్మానియా అధికారులు కూడా ధృవీకరించారు.. నకిలీ సర్టిఫికెట్ విషయాన్ని సీపీకి వివరించారు విద్యార్థి నేతలు… కన్సల్టేషన్, ఎడ్యుకేషన్, ఇనిస్టిట్యూట్స్ అడ్డగా ఈ దందా సాగుతుందని సీపీ దృష్టికి తీసుకెళ్లారు..…
హైదరాబాద్ నగరంలో పోలీసులు నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ మేరకు మలక్‌పేట్, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో అంత రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ల ముఠాను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న 10 మంది అంతర్‌రాష్ట్ర నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్…
ఏపీలో ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ప్రతిపక్షనేత చంద్రబాబు ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇంటికి వెళ్ళి చాలా మాట్లాడారు.ౠ మాటలు విని చాలా ఆచ్చర్యపోయాను. అరెస్ట్ చేయటానికి ముహుర్తం , వర్జ్యం , రాహుకాలం చూస్తారా? అని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. అరెస్ట్ కి ముహుర్తం కావాలంటారు… బెయిల్ పిటిషన్ కు మాత్రం చంద్రబాబుకు సమయం సందర్బం అవసరం లేదు. అర్దరాత్రి అయినా విచారణ జరగాలని హౌస్ మొషన్ పిటిషన్ వేస్తారు.…
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో ఏసీటీవోగా పని చేసిన సమయంలో అశోక్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. తన సర్వీసు రికార్డు లేకుండానే అశోక్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే అభియోగంపై కేసు నమోదు చేశామన్నారు. అశోక్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేశారని సీఐడీ అధికారులు ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్‌లో…