Hyderabad: నగరంలో నకిలీ సర్టిఫికెట్ల దందా.. 10 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో పోలీసులు నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ మేరకు మలక్‌పేట్, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో అంత రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ల ముఠాను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న 10 మంది అంతర్‌రాష్ట్ర నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నత విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందన్నారు. మలక్‌పేటలో శ్రీ సాయి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒక్కో డిగ్రీకి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారని.. తల్లితండ్రులకు తెలిసే విద్యార్థులు నకిలీ సర్టిఫికెట్స్ కొనుగోలు చేస్తున్నారని సీవీ ఆనంద్ తెలిపారు.
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని వారికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అమ్ముతున్నారన్నారు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ కన్సల్టెన్సీ పెట్టాడని.. టెలీకాలర్లు ఫెయిల్ అయిన విద్యార్థులకు కాల్ చేసి వారిని రప్పిస్తున్నారని తెలిపారు. బీటెక్ సర్టిఫికెట్లు ఇవ్వాలి అంటే రూ.3 లక్షలు, బీఎస్సీ సర్టిఫికెట్ కావాలంటే రూ.1.7 లక్షలు, బీకాం సర్టిఫికెట్ కావాలంటే రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్నారన్నారు.
Also Read
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
ఈ కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్ సహాయంతోనే ఈ దందా కొనసాగుతుందని హైదరాబాద్ సీపీ పేర్కొన్నారు. SRK యూనివర్సిటీ చైర్మన్ కూడా సంబంధాలు ఉన్నట్లు తేలిందని.. దీనిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ప్రైడ్ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో కూడా మరో ముఠా ఇలాగే దందా చేస్తున్నారన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఒక్కో సర్టిఫికెట్‌ను లక్షల్లో అమ్ముతున్నారని తెలిపారు. SRK యూనివర్సిటీ చెందిన 8 నకిలీ సర్టిఫికెట్లు, మధ్యప్రదేశ్‌లోని స్వామి వివేకానంద యూనివర్సిటీకి చెందిన 24 సర్టిఫికెట్లు, యూపీకి చెందిన గ్లోకల్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల నుంచి రబ్బర్ స్టాంపులు, వివిధ యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లను సీజ్ చేశామన్నారు. ఇంకా హైదరాబాద్‌లో మరో 5 నకిలీ సర్టిఫికెట్ల ముఠాలు ఉన్నట్లు గుర్తించామని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!