ఉన్నత విద్యామండలి కార్యాలయంలో తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వెరిఫికేషన్ సర్వీసెస్‌పై ప్రత్యేకంగా చర్చ జరిగింది. నకిలీ సర్టిఫికెట్లను చెక్ చేయడంపై అధికారులు సమీక్షించారు. విద్యార్థుల డేటా వెరిఫికేషన్‌పై మేధో మదన సమావేశం నిర్వహించామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సాధికారికంగా, సులభంగా, అథెంటిక్‌గా ఉండాలని భావిస్తున్నామని… ఫేక్…
నకిలీ సర్టిఫికెట్ లను అరికట్టేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రేపు అన్ని యూనివర్సిటీ వీసీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి హాజరు కానున్నారు. వెబ్‌సైట్‌లో స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వేరిఫికేషన్ సర్వీసెస్ ను ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకురానుంది. స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వేరిఫికేషన్ సర్వీసెస్ ద్వారా, నకిలీ సర్టిఫికెట్ దందా ను అరికట్టడం, ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు సర్టిఫికెట్స్ వేరిఫికేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుందని అధికారులు…
దేశంలో గుర్తింపు కలిగిన వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న పన్నెండుమంది ( 12 ) ముఠా సభ్యలను వరంగల్ టాస్క్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు . ఈ ముఠా సభ్యుల నుండి దేశంలో వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించి 212 నకిలీ సర్టిఫికెట్లు , 6 ల్యాప్‌టాప్‌లు,…
విజయవాడ దుర్గగుడి లో నకిలీ సర్టిఫికెట్లు కలకలం రేపుతున్నాయి. దుర్గగుడి లో పనిచేస్తున్న ఇద్దరు ఆలయ ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్ల తో పదోన్నతి పొందారు. తాజాగా అధికారుల విచారణలో నకిలీ సర్టిఫికెట్లు బాగోతం బయటపడింది. దుర్గగుడిలో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తున్న రాజు జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణులు నకిలీ సర్టిఫికెట్ల తో పదోన్నతి పొందినట్లు గుర్తించి వారిని సస్పెండ్ చేసారీ ఆలయ ఈఓ. సస్పెండ్ చేసిన ఆ ఇద్దరు పైన కేసు నమోదు చేసే అవకాశం…