Bandi Sanjay Demands KCR Resgination Over Fake Certificates: నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం.. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమని పేర్కొన్నారు. నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో పాస్‌పోర్ట్ పొంది.. ఉగ్రవాదులందరూ పాతబస్తీలో పాగా వేస్తున్నారని వ్యాఖ్యానించారు. పాతబస్తీ ఐఎస్ఐ అడ్డాగా మారిందని అన్నారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా.. మూలాలు పాతబస్తీలో బయటపడటమే అందుకు నిదర్శనమని చెప్పారు. ఓట్లు, సీట్ల కోసం పాతబస్తీని ఎంఐఎం పార్టీకి కేసీఆర్ ధారాదత్తం చేశారన్నారు. అల్లర్లు సృష్టించి, కేంద్రాన్ని బదనాం చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందవచ్చన్న ఉద్దేశంతో.. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిపి కుట్ర పన్నాయన్నారు. కేసీఆర్‌కు చిత్తుశుద్ధి ఉంటే.. ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.
CM KCR: అన్ని రంగాల్లో స్త్రీలు పురోగమించిన నాడే.. దేశాభివృద్ధి సంపూర్ణం
అంతకుముందు.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల జారీ వెనుక ఎంఐఎం పార్టీ కుట్ర దాగి ఉందని ఆరోపణలు చేశారు. ఓల్డ్ సిటీలోనే ఎక్కువగా బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయని.. ఇందులో టెర్రరిస్టులు కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీకి ముందు నుంచే నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడం అలవాటు ఉందన్న ఆయన.. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ కోసమే ఈ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ అధికారుల సంతకం గానీ, స్టాంప్ గానీ లేకుండా ఒక్క బర్త్ సర్టిఫికెట్ కూడా తయారవ్వదని.. అలాంటిది హైదరాబాద్‌లో 27 వేల బర్త్ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని టెర్రిరిస్ట్ అడ్డాగా మారుస్తున్నారని, ఈ కుట్రపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఎన్నో అక్రమ రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
Urfi Javed: బావుంది సార్.. కొంచెం బట్టలు వేసుకుంటే ఇంకా బావుండేది