అన్నింటా నకిలీలు రాజ్యమేలుతున్నాయి. న్యాయవాదుల నకిలీ సర్టిఫికెట్ల పై దర్యాప్తు కొనసాగుతోంది. తుళ్లూరు డీఎస్పీ పోతురాజు నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై కీలక విషయాలు వెల్లడించారు. నకిలీ న్యాయవాదుల కేసులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం అన్నారు. తుళ్లూరు సీఐ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఇతర రాష్ట్రాలకు బృందాలు వెళ్ళనున్నాయన్నారు. పేరు. యూజీసీ గుర్తింపు లేని యూనివర్సిటీ ల పేరు తో సర్టిఫికెట్ల ను సమర్పించిన న్యాయవాదుల పై కేసులు నమోదు చేస్తామన్నారు. బార్ కౌన్సిల్ సెక్రటరీ పద్మావతి ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు నమోదు చేసాం అని చెప్పారు.
Read Also: Abdul Rehman Makki: కాశ్మీర్ పాకిస్తాన్ జాతీయ సమస్య.. గ్లోబల్ ఉగ్రవాది మక్కీ..
ఆరోపణలు ఎదుర్కుంటున్న ఐదుగురిలో ఇద్దరు మహిళా న్యాయవాదులు ఉన్నారన్నారు. బోథ్ గయ యూనివర్సిటీ బీహార్, డిబ్రుఘడ్ యూనివర్సిటీ అస్సాం, మమ్మై యూనివర్సిటీ యూపీలనుండి లా డిగ్రీ లు పొందినట్లు నకిలీ సర్టి ఫికెట్ లను సమర్పించారు కొందరు ఫేక్ న్యాయవాదులు. గత మూడు సంవత్సరాలుగా అడ్వకేట్ లు నిర్వహించిన కార్యకలాపాలపై ఆరోపణలు వచ్చాయి. యూనివర్సిటీ ల నుండి వచ్చిన సర్టిఫికెట్ లపై క్రాస్ చెక్ చెక్ చేసింది బార్ కౌన్సిల్. సర్టిఫికెట్లు నకిలీవి అని నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు బార్ కౌన్సిల్ సెక్రటరీ పద్మావతి. ఈ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది.
Read Also: Konda Surekha Hot Comments Live: కోమటిరెడ్డిని సస్పెండ్ చేయాలి