తీవ్ర సంక్షోభంలో వున్న శ్రీలంకలో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రరూపు దాల్చింది. ధరలు ఆకాశాన్నంటుతుండడం, నిత్యావసరాల కొరత, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో లంకేయులు అల్లాడిపోతున్నారు. దీంతో దేశంలో అరాచక పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం 36 గంటల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. దీనికి తోడు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల అస్థిరత రాజ్యమేలుతుండడంతో ఈ కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం…
సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. యువతీయువకులు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను దుర్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి మోసపోయి కేటుగాళ్ళ చేతిలో అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి కేసుకి సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువతిపై అత్యాచారం చేశారు. మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో డయల్ 100 కు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే పరిధిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్…
ఉక్రెయిన్ రష్యా మధ్య ఇప్పటికే గత మూడు రోజులుగా యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధంలో విజయం సాధించి ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రష్యా చూస్తున్నది. అయితే, వీలైనంత వరకు రష్యా సేనలకు నిలువరించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా తీసుకున్న యుద్ధ నిర్ణయం పట్ల ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. ఆంక్షలు విధించినప్పటికీ రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదోఒకటి ఫేక్ న్యూస్ తెగ రచ్చ చేస్తోంది.. అసలు ఏది వైరల్, ఏ రియల్ అని కనిపెట్టడమే కష్టంగా మారింది… అది ఫేక్ అని తెలిసేలోపే.. వైరల్‌గా మారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. అయితే, ఈ వ్యవహారంలో గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సంస్థలపై కేంద్ర సర్కార్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.. ఫేక్ న్యూస్ అరికట్టడంలో తగినన్ని చర్యలు చేపట్టక పోవడంలో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అయితే, సామాజిక…
ఫేస్‌బుక్ ప్రారంభం నుంచి మెసెంజర్‌కు మంచి డిమాండ్ ఉన్నది. షార్ట్ మెసేజింగ్ కోసం దీనిని వినియోగించేవారు. అయితే, వాట్సప్ అందుబాటులోకి వచ్చిన తరువాత మెసెంజర్ వాడకం తగ్గిపోయింది. అయితే, మెసెంజర్‌లో భారీ మార్పులు చేసి వినియోగదారులకు అందించేందుకు ఫేస్‌బుక్ సిద్దమయింది. ఇకపై మెసెంజర్ చాట్‌లో స్క్రీన్ షాట్ తీస్తే సదరు వినియోగదారుడిని అలర్ట్ చేస్తూ మెసేజ్ వెళ్తుంది. దంతో చాట్ చేసేవారు అలర్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. చాట్‌పై పలు ఫిర్యాదులు అందుతున్న సమయంలో ఫేస్‌బుక్ ఈ…
అమెరికాలో కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఎక్కువ మంది ఒకచోట గుమికూడకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. టెకీ ఉద్యోగులు గత ఏడాదిన్నరగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మరికొన్నాళ్లు ఇదే మోడ్‌ను అమలు చేయనున్నారు. ఇక ఇదిలా ఉంటే, జనవరి 5 నుండి 8 వ తేదీ వరకు లాస్‌వేగాస్‌లో టెక్ కాన్ఫరెన్స్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో జరగాల్సి ఉంది. ఈ షో భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. Read:…
ప్రపంచంలో అత్యధిక మందిని ఆకర్షించిన వెబ్‌సైట్, బ్రౌజింగ్ చేసిన వెబ్‌సైట్ ఏమిటి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది గూగుల్. కానీ, ఈ ఏడాది గూగుల్ ను మించిపోయేలా వెబ్ సైట్‌లను సెర్చ్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది అత్యధికమందిని ఆకర్షించిన వెబ్‌సైట్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్. ప్రపంచంలోనే అత్యధికమంది ఈ వెబ్‌సైట్‌ను సందర్శించారు. రెండో స్థానంలో గూగుల్.కామ్ ఉన్నది. ఇక మూడో స్థానంలో ఫేస్‌బుక్ ఉండగా, నాలుగో స్థానంలో మైక్రోసాఫ్ట్, ఐదో…
ఫేస్‌బుక్ మరో సరికొత్త అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ఫేస్‌బుక్ ఖాతాలను యాక్సెస్ చేయలేని వారు, బ్లాక్ అయిన ఖాతాలను తిరిగి యూజర్లు పొందేందుకు.. లైవ్ చాట్ సపోర్ట్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ యాడ్ చేసింది. ఈ ఫీచర్.. యూజర్లు తమ ఖాతాలను తిరిగి పొందేందుకు తోడ్పడనుంది. అయితే, లైవ్ చాట్ సపోర్ట్ కేవలం ఇంగ్లీష్‌లోనే అందుబాటులో ఉంది. ఫేస్‌బుక్ సపోర్ట్‌పై క్లిక్ చేస్తే కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌తో యూజర్లు చాట్ చేసే అవకాశం కల్పిస్తోంది. Read Also: జనవరి 1 నుంచి…
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డీలిట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు సీబీఐ అధికారులు అమెరికా సాయాన్ని కోరనున్నారు. యుఎస్‌లోని సంబంధిత అధికారుల నుంచి సమాధానం కోసం ఎదు రు చూస్తున్నట్టు కొందరూ అధికారులు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐ స్వీకరించిన తర్వాత డజన్ల కొద్దీ వ్యక్తులను ప్రశ్నించింది, వరుసగా ఫోరెన్సిక్ పరీక్షలను నిర్వహించింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ (సీబీఐ). ఇప్పటికే సీబీఐ పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (MLAT)…
ఫేస్‌బుక్ వరుసగా ఏదో ఒక వివాదంలో ఇరుకుంటోంది. ఫేస్ బుక్ వినియోగాదారుల డాటా లీక్ అయ్యిందని లాంటి ఆరోపణలతో పలుమార్లు వార్తల్లో నిలిచింది ఫేస్‌బుక్. అయితే వివాదంలో చిక్కకున్న ప్రతి సారి ఆధికంగా నష్టం వాటిల్లడంతో ఫేస్‌బుక్ మాతృసంస్థ పేరు మార్చాలని డిసైడ్ అయ్యారు.. మెటా గా కూడా నామకరణం చేశారు. కానీ ఇప్పుడు ఆ పేరు చిక్కులు తెచ్చిపోట్టింది. అమెరికాకు చెందిన ఓ టెక్ సంస్థ మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్ స్క్యూలిక్ కోర్టును ఆశ్రయించారు.…