అమెరికాలో కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఎక్కువ మంది ఒకచోట గుమికూడకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. టెకీ ఉద్యోగులు గత ఏడాదిన్నరగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మరికొన్నాళ్లు ఇదే మోడ్‌ను అమలు చేయనున్నారు. ఇక ఇదిలా ఉంటే, జనవరి 5 నుండి 8 వ తేదీ వరకు లాస్‌వేగాస్‌లో టెక్ కాన్ఫరెన్స్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో జరగాల్సి ఉంది. ఈ షో భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Read: టెస్లాకు హువావే షాక్: ఒకసారి ఛార్జ్ చేస్తే…
కరోనా, ఒమిక్రాన్ ఆంక్షలు, నిబంధనల కారణంగా గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలు ఈ షోకు హాజరుకాకూదని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇదే బాటలో మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా నిర్ణయం తీసుకుంది. లెనొవొ, టీ-మొబైల్స్, ఏటీ అండ్ టీ, మెటా, ట్విటర్, అమెజాన్, టిక్‌టాక్, పింట్‌రెస్ట్, ఆల్ఫాబెట్ వంటి సుమారు 40 సంస్థలు ఈ షోకు హాజరుకాకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. సుమారు 2200 లకు పైగా టెక్ కంపెనీలు ఈ టెక్ కాన్ఫరెన్స్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో పాల్గొంటాయి. బడా సంస్థలన్నీ ఎలక్ట్రానిక్ షోకు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకోవడంతో నిర్వాహకులు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు.