ఉక్రెయిన్ రష్యా మధ్య ఇప్పటికే గత మూడు రోజులుగా యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధంలో విజయం సాధించి ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రష్యా చూస్తున్నది. అయితే, వీలైనంత వరకు రష్యా సేనలకు నిలువరించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా తీసుకున్న యుద్ధ నిర్ణయం పట్ల ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. ఆంక్షలు విధించినప్పటికీ రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. కాగా, రష్యాపై సోషల్ మీడియా దిగ్గజం మెటా ఆంక్షలు విధించింది.
Read: War Effect: స్టీల్ ఉత్పత్తికి భారీ దెబ్బ…
రష్యాలో మెటా అనుబంధ సంస్థలపై కూడా ఆంక్షలు విధించినట్టు తెలియజేసింది. అయితే, మెటా తీసుకున్న నిర్ణయం పట్ల రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తల్లోని వాస్తవాలను ప్రచారం చేయకుండా ఎడిటింగ్ చేసి రష్యాకు వ్యతిరేకంగా వార్తలను ప్రచారం చేస్తున్నారని చెప్పి రష్యా ప్రభుత్వం ఫేస్‌బుక్ పై పాక్షికంగా ఆంక్షలు విధించింది. రష్యా ఫేస్‌బుక్‌పై ఆంక్షలు విధించడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.