ఒక్క నిమిషంలో 16విన్యాసాలు చేసి ఓ పంది గిన్నీస్ రికార్డులకెక్కింది. యజమాని చెప్పిన ఆదేశాలను పాటిస్తూ గినియా పంది విన్యాసాలు చేస్తున్న వీడియోను 'గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్' తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది.
ఈమధ్య సోషల్ ప్లాట్‌ఫామ్స్ తెగ ఇబ్బంది పడుతున్నాయి. ఉన్నట్టుండి పని చేయడం మానేస్తున్నాయి. నిన్నటికి నిన్న ట్విటర్‌లో ఏదో సమస్య వచ్చినట్టు తేలింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ సర్వర్ డౌన్ అవ్వడంతో.. యూజర్లు ఒక్కసారిగా ట్విటర్ మీద పడ్డారు. అప్పటివరకూ బాగానే పని చేసిన ఇన్‌స్టా, సడెన్‌గా ఆగిపోయింది. లైవ్ సెషన్స్ వాటికవే రీస్టార్ట్ అయ్యాయి. లైవ్ సెషన్స్‌లో కామెంట్స్ కూడా మాయమయ్యాయి. న్యూస్ ఫీడ్ కూడా లోడ్ అవ్వలేదు. దీంతో, తమ మొబైల్‌లో ఏమైనా సమస్య ఉందేమోనని…
వ్యాపారులు ఇటీవల కొత్త పంథాలో ఆలోచిస్తున్నారు. తమ బిజినెస్ చక్కగా సాగాలనే ఉద్దేశంతో పాపులర్ అయిన పేర్లను షాపులకు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ దూసుకుపోతోంది. ప్రతి మొబైల్‌లో ఫేస్‌బుక్ ఉండాల్సిందే. ఈ మధ్య ఫేస్‌బుక్ లైవ్స్, రీల్స్ కూడా నెటిజన్లు చేసేస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన వ్యాపారి ఫేస్‌బుక్ పేరును వాడి లబ్ధి పొందాలని ప్రయత్నించాడు. అచ్చంగా అదే పేరు పెడితే కేసు అవుతుందని భావించి తన బేకరీకి ‘ఫేస్ బేక్’ అని పేరు…
ఇండియాలో ఏదైనా సమచారం తెలుసుకోవాల్సి వస్తే.. సోషల్ మీడియాను ఆశ్రయించేవారి సంఖ్య పెరిగిపోయిందట.. 54 శాతం మంది ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లనే ఆశ్రయిస్తున్నారు ఆ సర్వేలో తేల్చింది..
హైదరాబాద్ లోని బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నేటి ఉదయం 9 గంటల నుంచి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు అధికారులు. అయితే లాటరీ షెడ్యూల్, ఇతర పూర్తి వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. కాగా బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించిన విషయం తెలిసిందే. అయితే ఈఫ్లాట్ల విక్రయానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ ఇవ్వడంతో.. ఇవాల్లి నుంచి…
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఉపయోగించే వారిలో చాలా మంది ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. అయితే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఫేస్‌బుక్‌లో కీలకమార్పులు జరగబోతున్నాయి. బ్లూరంగులో కనిపించే ఫేస్‌బుక్ టికర్ ఇకపై కనిపించదు. దాని స్థానంలో మెటా టికర్, లోగోను త్వరలో తీసుకురాబోతున్నామని మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఆ టికర్‌తోనే ట్రేడింగ్ చేస్తామని అమెరికా స్టాక్‌మార్కెట్ నాస్‌డాక్‌కు తెలిపారు. 2004లో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను ప్రారంభించగా 2012లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. ఆ సమయంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన టికర్, లోగోనూ…
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు షాక్ తగిలింది. కీలక స్థానంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నెంబర్ 2 స్థానంలో ఉన్న షెరిల్ శాండ్ బర్గ్ మెటా నుంచి వైదొలుగుతున్నారు. 14 ఏళ్ల నుంచి మెటాలో ఎంతో కీలకంగా ఉన్న షరిల్ తన పదవి నుంచి దిగిపోతున్నట్లుగా ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఇదిలా ఉంటే బోర్డ్ ఆఫ్ మెంబర్స్ లో మాత్రం సభ్యురాలిగా కొనసాగుతానని వెల్లడించారు. ఫేస్ బుక్ మాతృసంస్థ…
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి… మృతి చెందారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే, తప్పుడు వదంతులపై నిత్యానంద క్లారిటీ ఇచ్చారు. తాను సమాధిలోకి వెళ్లానని… తన అనుచరులు, భక్తులు, శిష్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నట్లు వివరించిన నిత్యానంద… వైద్యుల బృందం చికిత్స చేస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నానని……
చక్కటి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి సామాజిక మాధ్యమాలు. వివాహ బంధాలను బలహీనపరిచి.. భర్తను భార్య.. భార్యను భర్త.. అతి కిరాతకంగా హత్య చేయిస్తున్నారు. సంసారాల్లోకి చొచ్చుకొస్తున్న సోషల్ మీడియా కనీవినీ ఎరుగని దారుణాలకు దారి వేస్తోంది. ఫేస్‌బుక్.. వాట్సాప్.. ఇన్‌స్టాగ్రామ్.. ట్విటర్. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వీటి వినియోగం చాలా ఎక్కువ. భావస్వేచ్ఛా ప్రకటనకు ఈ సామాజిక మాధ్యమాలు తొలినాళ్లలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. కానీ.. అవే వేదికలు ఇప్పుడు దారుణమైన నేరాలకు.. నేర ప్రవృత్తికి బాటలు…