సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు ఫేస్‌బుక్ డౌన్ అయింది. పలు సమస్యల కారణంగా ఫేస్ బుక్ ఓపెన్ కాలేదు. ఫేస్‌బుక్‌తో పాటుగా దాని అనుబంధ సంస్థలైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లు కూడా ఓపెన్ కాలేదు. దీంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఎందుకు ఇలా జరిగిందో తెలియన తికమకపడ్డారు. చాలామంది ట్విట్టర్‌లో పోస్టులు, మీమ్స్ పెట్టారు. అయితే, ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో తిరిగి రిస్టోర్ అయింది. …
కాసేపు సోషల్ మీడియా పనిచేయకపోతే ఎంత మంది ఎన్ని ఇబ్బందులు పడతారో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏకంగా ఏడు గంటలపాటు సోషల్ మీడియా పనిచేయకుంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో చెప్పాల్సిన అవసరం ఉండదు. సోమవారం రాత్రి 9:30 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు సుమారు 7 గంటల పాటు సోషల్ మీడియా ఆగిపోయింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లు నిలిచిపోయాయి. పనిచేయలేదు. దీంతో ఏమైందో తెలియక కోట్లాది మంది భయపడ్డారు. అయితే, ఈరోజు…
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. 20 నిమిషాలుగా పనిచేయని సేవలు.. ఫేస్‌బుక్ కు చెందిన సోషల్ మీడియా అప్లికేషన్స్ అయిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లు ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఫీడ్ రీఫ్రెష్ కూడా కాకపోవడంతో యూజర్ల నుంచి అసహనం వ్యక్తమైంది. అయితే దీనిపై మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఒక్క సారిగా…
ఆఫ్ఘనిస్థాన్‌లో తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు.. ఆ దేశ రాజధాని కాబూల్‌ను సైతం స్వాధీనం చేసుకుని.. వరుసగా అన్ని ప్రభుత్వ సముదాయాలపై జెండా పాతేస్తున్నారు.. ఇక, ఎప్పటికప్పుడు తాలిబన్ల మూమెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, సమాచారం సోషల్ మీడియాకు ఎక్కుతున్నాయి.. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది.. తాలిబన్లకు సంబంధించిన ఏ సమాచారానికి తమ వేదికలో స్థానం లేదని స్పష్టం చేసింది. తమ సేవలు వినియోగించుకునే అవకాశం లేకుండా తాలిబన్లపై నిషేధం…
ఇప్పుడు అంతా సోషల్ మీడియా కాలం.. చాలా విషయాలు సోషల్ మీడియాకు ఎక్కి హల్ చల్ చేస్తుంటాయి.. ఇక, లైక్‌లు, కామెంట్లు, షేరింగ్‌లు.. ఇలా అది తప్పా..? ఒప్పా..? అనే విషయంతో సంబంధం లేకుండా అలా వైరల్ చేసేవాళ్లు లేకపోలేదు.. అయితే.. ఎన్నికలు, ఓట్ల లెక్కింపు జరుగుతోన్న సమయంలో.. ఎలాంటి సమస్యలు సృష్టించకుండా సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది ఈస్ట్ ఆఫ్రికా దేశమైన జాంబియా.. ఈ నెల 12వ తేదీన జాంబియాలో దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి.…
ప్రముఖ యాంకర్ గాయత్రి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. సోషల్ మీడియాకు ఆమడ దూరంగానే ఉండే గాయత్రి ఫేస్ బుక్ ను హ్యాక్ చేశారు కొందరు కేటుగాళ్లు. అనంతరం ఆ అకౌంటర్ ద్వారా వివిధ మతాలకు సంబంధించిన అభ్యంతరకర సందేశాలు షేర్ చేశారు. అయితే.. అభ్యంతరకర పోస్టులు పెట్టగానే… అలర్ట్ అయిన యాంకర్ గాయత్రి… తన ఫేస్ బుక్ ఖాతా ను ఎవరో హ్యాక్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే… ఈ కేసు పై సిటీ…
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలిచింది. ఇదివరకు నెంబర్. 1 గా వున్న ఫేస్‌బుక్‌ను టిక్‌టాక్ అధిగమించింది. ఒక్కసారిగా టిక్‌టాక్ గ్లోబల్ మార్కెట్‌లో పుంజుకొని ఫేస్‌బుక్ మార్కెట్‌ను దెబ్బతీసింది. 2020 సంవత్సరంలో అత్యధిక యూజర్లు డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలిచినట్లు ప్రముఖ బిజినెస్ జర్నల్ నిక్కీ ఏషియా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ తన మార్కెట్‌ను విస్తరించుకుంటూ వెళ్లడంతో ఈ ఘనతను సాధించినట్లుగా నిక్కీ ఏషియా వెల్లడించింది. అయితే.. ఇండియాలో గత సంవత్సరం జూన్…
రౌడీ బాయ్ గా యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు. సోషల్ మీడియా లో విజయ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ లో 1 కోటీ 25 లక్షల మంది ఫాలోవర్స్ ను కలిగి సౌత్ ఇండియాలోనే నంబర్ 1 హీరోగా రికార్డు సృష్టించిన విజయ్ ఇప్పుడు ఫేస్ బుక్ లో కూడా కోటి మంది ఫాలోవర్స్…
సోషల్ మీడియాలో కరోనా వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ టీకాలపై ప్రముఖ సామాజిక మాద్యమం ఫేస్ బుక్ లో దుష్ప్రచారం జరుగుతోందని తెలిపారు. సోషల్ మీడియా అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అసత్య ప్రచారంతో ప్రజల ప్రాణాలు బలి తీసుకోవద్దని కోరారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా టీకాలు తీసుకోవడం మంచిదని.. కరోనా…