సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డీలిట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు సీబీఐ అధికారులు అమెరికా సాయాన్ని కోరనున్నారు. యుఎస్‌లోని సంబంధిత అధికారుల నుంచి సమాధానం కోసం ఎదు రు చూస్తున్నట్టు కొందరూ అధికారులు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐ స్వీకరించిన తర్వాత డజన్ల కొద్దీ వ్యక్తులను ప్రశ్నించింది, వరుసగా ఫోరెన్సిక్ పరీక్షలను నిర్వహించింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ (సీబీఐ). ఇప్పటికే సీబీఐ పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (MLAT) కింద US సహాయాన్ని కోరింది. పబ్లిక్ లేదా క్రిమినల్ చట్టాలను అమలు చేసే ప్రయత్నంలో సమా చారాన్ని సేకరించడం మార్పిడి చేయడం కోసం రెండు లేదా అంత కంటే ఎక్కువ దేశాల మధ్య ఈ చట్టపరమైన ఒప్పందం అమలు అవు తుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తొలగించబడిన ఈ-మెయిల్‌లు, పోస్ట్‌ల గురించి భారతదేశం గూగుల్, ఫేస్‌బుక్ నుంచి ఇప్పటికే సమాచారాన్ని కోరింది.
ఇప్పటివరకు సాగిన సీబీఐ విచారణ..
అంతకుముందు, ఈ కేసులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రూమ్‌మేట్, అతని ఉద్యోగులు, నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు, ఇంకా అనేక మంది వ్యక్తుల వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. అయితే, అతను హత్యకు గురైనట్లు నిర్ధారించడానికి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు. అనేక ప్రభుత్వ ల్యాబ్‌ల ఫోరెన్సిక్ పరీక్షలు కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో ఎటువంటి ఆధారాలు లభించలేదని తేల్చి చెప్పాయి. దీంతో నటుడి కుటుంబం చేసిన ఫిర్యాదుపై, రియా చక్రవర్తి,ఆమె కుటుంబ సభ్యులపై ఆత్మహత్యకు ప్రేరేపిం చారనే అభియోగం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ముంబై పోలీసులు విచారణలో నటుడి మరణానికి బాధ్యులెవరో తేల్చలేదు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును విచారిస్తోంది.