ప్రపంచంలో అత్యధిక మందిని ఆకర్షించిన వెబ్‌సైట్, బ్రౌజింగ్ చేసిన వెబ్‌సైట్ ఏమిటి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది గూగుల్. కానీ, ఈ ఏడాది గూగుల్ ను మించిపోయేలా వెబ్ సైట్‌లను సెర్చ్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది అత్యధికమందిని ఆకర్షించిన వెబ్‌సైట్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్. ప్రపంచంలోనే అత్యధికమంది ఈ వెబ్‌సైట్‌ను సందర్శించారు. రెండో స్థానంలో గూగుల్.కామ్ ఉన్నది. ఇక మూడో స్థానంలో ఫేస్‌బుక్ ఉండగా, నాలుగో స్థానంలో మైక్రోసాఫ్ట్, ఐదో స్థానంలో యాపిల్, ఆరోస్థానంలో అమెజాన్ ఉన్నాయి.
Read: ప్రపంచదిశను మార్చేస్తున్న రోబోలు…
ఏడో స్థానంలో ఒటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్, 8వ స్థానంలో యూట్యూబ్, 9వ స్థానంలో ట్విట్టర్ ఉండగా పదో స్థానంలో వాట్సప్ నిలిచింది. వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఫేస్ బుక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ అన్నింటిని మెటా కిందకు తీసుకొచ్చారు.